Vennela Kishore : వచ్చీ రాగానే ఆకట్టుకున్నవారు.. తమ తొలి చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చేసుకుంటూ ఉంటారు. అలా చిత్రసీమలో ఎందరో నటీనటులు అప్పట్లో వెలుగులు విరజిమ్మారు. ప్రస్తుతం అలా సాగుతున్న వారిలో ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కూడా ఉన్నాడు. తొలి చిత్రం వెన్నెలతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన కిశోర్ ఆపై వెన్నెల కిశోర్ గా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన హాస్యంతో నవ్వుల వెన్నెల కురిపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీయెస్ట్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు కిశోర్.
అయితే ఎప్పుడు ఎవరినీ మాటలతో హర్ట్ చేయని వెన్నెల కిషోర్.. మొదటిసారి తన కారణంగా బాధపడిన హీరోయిన్ వలన నాగార్జున చేత తిట్టించుకున్నాడట. నాగ్, కిషోర్ కాంబోలో లాస్ట్ గా వచ్చిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాలో కృతి శెట్టి, వెన్నెల కిషోర్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. అయితే ఆ చనువుతో షూటింగ్ స్పాట్లో వెన్నెల కిషోర్ కృతి శెట్టిపై సరదాగా కొన్ని జోక్స్ వేశాడట.
దీంతో హర్ట్ అయిన కృతి ఈ విషయం నాగార్జునకి చెప్పి బాధపడిందంట. కిషోర్ ని పిలిచి నాగార్జున అర్థమయ్యే విధంగా చెప్పారట. ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చిన అమ్మాయి.. అలాంటి జోక్స్ తీసుకోలేదు. అయినా అమ్మాయిలపై అలాంటి జోక్స్ ఏంటయ్యా ఇంకోసారి ఇలాంటి జోక్స్ చేసావంటే రెమ్యూనరేషన్ కట్ చేయించేస్తాను. నా కోడలు పిల్లకు దూరంగా ఉండు అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడట. దీంతో అప్పటికప్పుడే వెన్నెల కిషోర్ కృతికి సారీ చెప్పాడట. బంగార్రాజు సినిమాలో కృతి.. నాగ చైతన్యను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా నటించిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…