Acharya Movie : ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లూసిఫర్ కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీగా కలెక్షన్స్ రావాలంటే భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అంతా భావించారు. కానీ ఆచార్య సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించినా కూడా కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో అందరికీ తెలిసిందే. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా గాడ్ ఫాదర్ మొదటి రోజే రూ.38 కోట్లు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లాంగ్ రన్ లో కూడా ఈస్థాయి వసూళ్లు రాలేదని తెలిసిందే. అయితే ఇప్పుడు అంతా ఆచార్య సినిమా ఎందుకు సక్సెస్ కాలేదనే విశ్లేషణలో పడ్డారు. ఎక్కువమంది అభిప్రాయం ఏంటంటే.. గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చిరంజీవి ప్రమేయం ఎక్కువగా ఉంది. దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఇలా ప్రతి విషయంలో చిరంజీవి సలహాలు మరియు సూచనల మేరకు దర్శకుడు మోహన్ రాజా సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందట. కానీ ఆచార్య విషయంలో మాత్రం దర్శకుడు కొరటాల శివపై పూర్తి నమ్మకం ఉంచి చిరంజీవి ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదట.
ఆచార్య సినిమా సన్నివేశాలు లేదా ఎడిటింగ్ ఏ ఒక్క విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్‌మెంట్ అస్సలు లేదు. కానీ గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. చివరకు విలన్ పాత్రలో సత్యదేవ్ నటిస్తే బాగుంటుందని సూచించింది తానే అని చిరంజీవి పేర్కొన్నాడు. ఇంకా చాలా విషయాల్లో చిరంజీవి ఇన్ పుట్స్ ఉపయోగపడ్డాయని చిత్ర యూనిట్ అనధికారికంగా తెలిపారు. మొత్తానికి చిరు ఆచార్య డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి గాడ్ ఫాదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ కి కూడా మంచి పండుగ గిఫ్ట్ ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…