RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు మరో మెయిన్ హైలైట్ అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసి రూ.1200 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. విదేశీ ఫిలిం మేకర్స్ కూడా ఈ చిత్రంలో హీరోల ఇద్దరి నటనకు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్‌తోపాటు ఇతర ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ షాకిచ్చింది. గుజరాతీ మూవీ చెల్లో షోను మన దేశం తరపున అత్యున్నత స్థాయి గుర్తింపు ఆస్కార్ బరిలోకి దింపింది. మనవాళ్లు మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు. కానీ అమెరికన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీని తమ సినిమాగా భావించారు. యూఎస్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఆస్కార్ అవార్డులకు ఆర్ఆర్ఆర్‌ను పంపడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఫర్ యువర్ కన్‌సిడరేషన్ కింద ప్రజల్లోకి ఆర్ఆర్ఆర్‌ను తీసుకెళుతుంది. స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఫర్ యువర్ కన్‌సిడరేషన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్‌ను పలు విభాగాలకు ఇండిపెండెంట్‌గా పంపడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీ ఇలా ఏకంగా 15 అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్ బరిలోకి పంపడానికి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫర్ యువర్ కన్‌సిడరేషన్ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం చాలా బావుంటుందని అందరూ భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…