Nagababu : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్‌బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు. చిరంజీవి కూడా ఎవరినీ నొప్పించకుండా అందరికీ ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చాడు. అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం ఇబ్బందిగా అనిపించింది. దీంతో.. అసహనానికి గురైన గరికపాటి అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను.
లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతసేపటికి చిరంజీవి వెళ్లి గరికపాటి పక్కనే కూర్చుని ప్రవచనం విన్నారు. అంతటితో ఆ చిన్నపాటి వివాదాస్పద పరిణామానికి శుభం కార్డు పడింది. అయితే.. ఆ వీడియో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. మెగా అభిమానులు చిరంజీవిని గరికపాటి అలా అనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుపై విరుచుకుపడుతున్నారు. ఆయన చిరంజీవిపై అక్కసుతోనే ఇలా మాట్లాడారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గరికపాటి గతంలో చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
తన కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానుల అసోసియేషన్ లో ఉండే వాడినని గరికపాటి చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యాన్స్ మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఏఎన్నార్ సినిమా విడుదలైతే పోస్టర్స్ పై పేడ వేయడం కూడా చేశాం అంటూ గరికపాటి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అభిమానిగా గరికపాటి అప్పట్లో అలా వ్యవహరించారు. చిరంజీవిపై అక్కడున్న వారు అభిమానంతో ఫోటోలు దిగుతుంటే కాసేపు ఓపిగ్గా ఉండలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు మెగా బ్రదర్ నాగబాబు కూడా రంగంలోకి దిగి గరికపాటిపై సెటైర్లు వేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పరిపాటే అంటూ సెటైర్లు వేయడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…