Nagarjuna : టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య అండ్ సమంత. వీరు విడిపోయి దాదాపుగా పది నెలలు గడుస్తున్నా కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. సమంత కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా అక్కినేని కుటుంబంపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూనే ఉంది. సమంత ఫ్యాన్స్ నాగచైతన్యకి వేరే హీరోయిన్ తో ఎఫైర్ ఉందని తప్పు పడుతుంటే.. నాగచైతన్య ఫ్యాన్స్ అక్కినేని వారి వంటి గొప్ప కుటుంబంలో కలవలేకపోతుందని సమంతను విమర్శిస్తున్నారు.
ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత ఎక్స్ హస్బెండ్.. అంటూ ఒకే రూమ్‌లో ఉన్నట్లయితే ఆ రూమ్‌లో ఆయుధాలు ఉండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్యను చంపేస్తాను అన్నట్లు వ్యాఖ్యలు చేయడం అక్కినేని అభిమానులకు మంటలు పుట్టించాయి. మొదట్లో నాగచైతన్య, సమంత విడిపోతున్నప్పుడు వారిద్దరినీ కలపడానికి నాగార్జున ఎంతగానో ప్రయత్నించారట. అయితే తాజాగా ఒక విషయం వైరల్ గా మారింది.

విడాకులు తీసుకోవడానికి ముందు నుంచే సమంత, నాగచైతన్య వేర్వేరుగా కొద్దిరోజులు ఉన్నారు. ఈ సమయంలో నాగార్జున వీరిద్దరినీ ఒకటి చేయడానికి సమంతకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసిందట. ఆ సమయంలో సమంత పక్కనే ఉన్న ఓ టాలీవుడ్ హీరో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అని చెప్పగా.. ఆయనకు (నాగార్జున) ఇంట్లో అంత సీన్ లేదు. ఆయనతో మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆయన భార్య చెప్పినట్లే వింటాడు.. అని అందరి ముందు నాగార్జున గురించి చాలా తక్కువ చేసి మాట్లాడిందట సమంత. ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ వార్త విన్న అక్కినేని అభిమానులు మాత్రం సమంతపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వారు ఆమెను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఆమె ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.