బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్ లో వేగం పెంచింది చిత్ర బృందం. అక్కినేని హీరో నాగ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో సమర్పిస్తుండడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ కాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఈ మూవీని అమీర్ ఖాన్ పెద్ద ఎత్తున నిర్మించాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్న నాగ చైతన్యకు ఇంటర్వ్యూలలో సమంతతో రిలేషన్ షిప్ గురించి.. బాలీవుడ్ నటితో ప్రేమయాణం గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనపై వారానికి ఓ రూమర్ బయటకు వస్తుందని.. తన లైఫ్‌కు సంబంధం లేని విషయాలపై ప్రచారం జరుగుతోందంటూ చైతూ కొట్టి పారేస్తున్నాడు. మరోసారి మీరు ప్రేమలో పడే అవకాశం ఉందా అని .? ఓ విలేకరి నాగ చైతన్యను ప్రశ్నించగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు చైతూ.. తప్పకుండా పడతానని.. భవిష్యత్‌లో ఏం జరగనుందో అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుందన్నాడు. మనం జీవించేందుకు గాలి ఎంత అవసరమో.. అదేవిధంగా జీవించేందుకు ప్రేమ కూడా అవసరమని అన్నాడు. మనం ప్రేమించాలని.. ఎదుటివారు కూడా మనల్ని ప్రేమించాలన్నాడు. అలా జరిగితే లైఫ్ లో ఎప్పటికీ పాజిటివ్‌గా ఉంటామంటూ ప్రేమపై నాగ చైతన్య తన అభిప్రాయాన్ని చెప్పాడు. టాలీవుడ్ లో సెలెబ్రిటీ జంటగా ఉన్న సమంత, నాగ చైతన్య గత సంవత్సరం విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. విడాకుల అనంతరం ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇటీవల చైతూ తాను నటించిన థాంక్యూ మూవీతో మెప్పించాడు.