తొలి చిత్రంతోనే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ కీర్తి చావ్లా. కీర్తి చావ్లా అనే పేరు ఇప్పటి వారికి అంతగా తెలియకపోవచ్చు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి చావ్లా. ఆది చిత్రంలో చబ్బి లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న కీర్తిచావ్లా స్టార్ స్టేటస్ ను ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది.
చిత్ర కథ సెలక్షన్ లో తప్పులు చేసి వరుస పరాజయాలను అందుకుంటూ త్వరగా ఫేడవుట్ అయిపోయింది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించినా కూడా ఆవిడ మంచి గుర్తింపు అనేది సాధించుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం కీర్తిచావ్లాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే.. కీర్తిచావ్లా ఇప్పటివరకు కూడా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికి కూడా సింగిల్ గా ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకొని అందరూ షాక్ కు గురయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి హాస్పిటల్స్ అంటే భయం. పెళ్లి చేసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు. పిల్లల్ని కనాలి అంటే కచ్చితంగా హాస్పటల్లో జాయిన్ అవ్వాలి. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయా అంటూ చెప్పిందట. కీర్తి చావ్లా చెప్పిన సమాధానం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారి, నెటిజన్లు సైతం ఈ విధంగా కూడా ఆలోచిస్తారా అంటూ నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు.