Naga Chaitanya : సమంత, నాగచైతన్య గతేడాది అక్టోబర్ మొదటి వారంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడైతే సమంత తన పేరు నుంచి అక్కినేని తొలగించి కేవలం ఎస్ అన్న అక్షరాన్ని ఉంచిందో.. అప్పటి నుంచే వీరు విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. తరువాత నెల రోజులకే అవే వార్తలు నిజమయ్యాయి. దీంతో వీరి విడాకులపై అనేక మంది స్పందించారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పటి వరకు చెప్పలేదు. దీంతో ఈ ప్రశ్నకు సమాధానం లేకుండానే మిగిలిపోయింది.
అయితే ఈ మధ్యే సీనియర్ నటుడు మురళీ మోహన్.. సమంత, చైతన్య జంటపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అప్పట్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మూడు అపార్ట్‌మెంట్లను కట్టించానని, తన కుటుంబ సభ్యుల కోసం వాటిని కట్టిస్తే చైతన్య వాటిల్లో ఒకటి తనకు కావాలని అడిగాడని, అయితే తనకు ఎంతో ఇష్టమైన అపార్ట్‌మెంట్లని వాటిని ఇవ్వనని చెప్పానని.. కానీ కొద్ది రోజులకు నాగార్జున కాల్ చేసి అడగడంతో కాదనలేకపోయానని.. మురళీ మోహన్ తెలిపారు. అప్పటి నుంచి చైతన్య అదే అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉండేవాడని అన్నారు. తరువాత సమంతతో కలసి నివసించడం మొదలు పెట్టాడని తెలిపారు.
అయితే వాస్తవానికి ఈ ఇద్దరూ విడిపోయిన తరువాత సమంత ఆ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వేరే చోటకు మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తుండడంతో ముంబైలో ప్రస్తుతానికి ఓ ఇంటిని రెంట్‌కు తీసుకుని సమంత ఉంటోంది. ఇక చైతూ విడాకుల అనంతరం కొంతకాలం పాటు హోటల్‌లో రూమ్‌ను తీసుకుని ప్రత్యేకంగా ఉన్నాడు. కానీ తరువాత ఇంకో ఇంటికి మారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తమ అపార్ట్‌మెంట్ ఖాళీగానే ఉందని తెలుస్తోంది. అయితే ఆ అపార్ట్‌మెంట్ ను చైతూ సమంతకే ఇచ్చేశాడట. కానీ అందులో ఆమె ఉండేందుకు ససేమిరా అందట. దీంతో దాన్ని చైతూ కూడా అలాగే వదిలేసి వేరే చోటకు వెళ్లిపోయాడు. ఇక ఆ అపార్ట్‌మెంట్‌ను తాను వాడుకోనని.. సమంతకే ఇచ్చేశానని చైతూ తెలిపాడట. దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
అయితే భవిష్యత్తులో ఈ జంట మళ్లీ కలిసే అవకాశాలు లేకపోవడంతో చైతూ ఆ అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఆ తరువాత దాని గురించి అప్‌డేట్ లేదు. మరి వీరి భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…