Liger Movie Trailer : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ.. లైగర్. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన నటించింది. అలాగే అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను కొంత సేపటి క్రితమే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ట్రైలర్ దుమ్ము లేపిందని ఫ్యాన్స్ అంటున్నారు. ట్రైలర్‌ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు.
లైగర్ మూవీని పూరీ జగన్నాథ్ స్వయంగా నిర్మించారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మిలు ఈ మూవీని నిర్మించగా.. ఇందులో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగమయ్యారు. హిందీ హక్కులను ఆయన కొన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం అయింది. ఇక రమ్యకృష్ణ ఇందులో విజయ్‌కి తల్లిగా నటించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇందులో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగ్స్ అనేకం ఉన్నాయి. అలాగే విజయ్ మానరిజం కూడా అద్భుతంగా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే విజయ్ ఈ మూవీలో పూర్తిగా భిన్నమైక లుక్‌లో కనిపించాడు. ఇందులో విజయ్ బాక్సింగ్ చాంపియన్‌గా నటిస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.
ఇక లైగర్ మూవీ ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా ఈ మధ్యే ఈ చిత్రంలోని విజయ్ లుక్‌కు చెందిన పోస్టర్‌ను లాంచ్ చేశారు. అందులో విజయ్ న్యూడ్‌గా కనిపించాడు. దీంతో ఆ ఫొటోపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఇక చిత్రంలో మైక్ టైసన్‌తో సెల్ఫీ దిగడమే సినిమా కథ అని ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…