Viral Video : రైలు పట్టాలపై దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని.. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు అసలు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారు. దీంతో చాలా మంది రైలు ప్రమాదాలకు గురవుతూ మృత్యువాత పడుతున్నారు. రైలు వస్తున్నా పట్టించుకోకుండా పట్టాలు దాటుతూ ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అయితే అక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. కానీ అదృష్టవశాత్తూ ఎవరి ప్రాణాలూ పోలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఆగి ఉన్న రైలు నుంచి కొందరు దిగి పట్టాలు దాటి అవతలి వైపుకు వెళ్తున్నారు. అయితే రైలు దిగి వేచి చూస్తున్న వృద్ధులను అవతలి వైపుకు దాటించేందుకు కొందరు మళ్లీ రైలు దగ్గరకు వచ్చారు. కానీ అంతలోపే ట్రెయిన్ రానే వచ్చింది. దీంతో పట్టాలు దాటుదామని అనుకున్నవారు కూడా వెనక్కి వచ్చేశారు. వారు రావడం కనీసం ఒక్క సెకన్ ఆలస్యం అయినా సరే వారి ప్రాణాలు పోయి ఉండేవి. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
రైలు పట్టాలపై చూసుకుని పట్టాలు దాటాలని.. లేదంటే రైలు ప్రమాదాల బారిన పడతారని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని.. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. కానీ జరిగి ఉంటే నిండు ప్రాణాలు పోయి ఉండేవని.. కనుక ఇప్పటికైనా పట్టాలపై జాగ్రత్తగా దాటాలని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…