Naga Chaitanya : ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత-చైతూలు అక్టోబర్ 2న విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సమంత -చైతూ విడాకులు చాలా మందిని ఇబ్బంది పెట్టాయి. ఈ ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న ఇమేజ్ రీత్యా విడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కారణం ఏదైనా కానీ, సర్దుకుపోయి, కలసి ఉంటే బాగుండేదని భావించారు. సమంత-చైతూలని అభిమానులు విడివిడిగా అస్సలు చూడలేకపోతున్నారు.
ప్రస్తుతం సమంత- నాగ చైతన్య తమ జ్ఞాపకాలను మెదడు నుండి చెరిపివేసే ప్రయత్నంలో ఉన్నారు. దాని కోసం ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తో విహార, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో గోవా, డెహ్రాడూన్, చార్ ధామ్ యాత్ర చేసింది. అనంతరం దుబాయ్ టూర్ కి వెళ్లడం జరిగింది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. విడాకుల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి సమంత తన భావాలను వ్యక్తపరిచేలా రకరకాల కొటేషన్స్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది.
https://www.instagram.com/p/CWfAmxWpayV/?utm_source=ig_web_copy_link
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని నాగచైతన్య మాత్రం ఎలాంటి పోస్ట్‌లు పెట్టడం లేదు. కానీ తాజాగా ఆయన చేసిన పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. మాథ్యూ మాక్కోనాగై అనే రచయిత రాసిన బుక్‌ను పూర్తి చేశాడు చై. ఈ విషయాన్ని ఇన్‌స్టావేదికగా షేర్ చేసిన నాగచైతన్య.. ‘జీవితానికి ఇదొక ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు మాథ్యూకి కృతజ్ఞతలు.
ఈ పుస్తకం నా జీవితానికి ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. నాగచైతన్య చేసిన ఈ పోస్ట్‌కి వెనుక పరమార్ధాలు ఏమైనా ఉన్నాయా.. అని ఆలోచిస్తున్నారు అభిమానులు.