Naga Chaitanya : అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య స్వీట్ అండ్ క్యూట్ పర్సన్ అనే విషయం తెలిసిందే. ఇతగాడు సమంతని ప్రేమించి పెళ్లి చేసుకోగా, అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య, సమంత తొలిసారిగా 2009లో ఏ మాయ చేశావే చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులుగా వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరీ చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోవడంతో ఈ జంటను ప్రేక్షకులు ఆదరించారు. ఈ జంటని చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోయారు. వీరు విడిపోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.
గతేడాది లవ్‌స్టోరీతో హిట్‌కొట్టిన నాగ చైతన్య ఈ ఏడాది బంగర్రాజుతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన థాంక్‌యూ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అవికాగోర్, మాళవికా నాయర్‌లు కీలకపాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ఇంకో సిరీస్‌లో నటిస్తున్నాడు నాగ చైతన్య.
సమంత విడాకుల తర్వాత తెగ వార్తలలో నిలుస్తూ ఉంటోంది. సోషల్ మీడియాలో అనేక ఆసక్తికర పోస్ట్ లు పెడుతోంది. కానీ నాగ చైతన్య మాత్రం పూర్తి సైలెంట్‌గా ఉంటున్నాడు. సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి కూడా ఎలాంటి పోస్ట్‌లు పెట్టడం లేదు చైతూ. విడాకుల తర్వాత చై పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లాడు. అతని సైలెన్స్‌ని అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అతను తిరిగి యాక్టివ్ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. చైతూ నటించిన బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా విడుదలకి సిద్ధంగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…