Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ అమ్మడు సినిమాలు, సోషల్ మీడియా, టూర్స్ ఇలా ప్రతి విషయంతోనూ అందరి నోళ్లలో నానుతుంటుంది. టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ఏమాయ చేశావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఫిదా చేసింది. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుని ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారడం విశేషం.
సమంత ఇటీవల తన ఫస్ట్ జీతం రూ.500 అని తెలియజేసింది. కెరీర్ మొదటి నుండి చాలా కష్టపడుతూ వచ్చిన సమంత తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నేడు (ఏప్రిల్ 28) సమంత తన 35వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో సమంత ట్రెండ్ అవుతోంది. ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాషన్ రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ, ఫ్యాషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది సమంత.
అందులో భాగంగా సమంత వాడే బ్యాగులు, వాటి వివరాలు, ధరలు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. సమంత వద్ద వైఎస్‌ఎల్ లవ్ బాక్ క్లచ్ బ్యాగ్, బట్టేగా వెనెటా పంచ్ స్లింగ్ బ్యాగ్, ప్రద వింటేజ్ బ్యాగ్, లూయిస్ వుయిట్టన్ బ్లీకర్‌బ్యాగ్, లూయిస్ వియుట్టన్ ట్విస్ట్ బ్యాగ్ వంటి లగ్జరీ బ్యాగులున్నాయి. వీటి ధర ఏకంగా రూ.1.40 లక్షలు ఉండడం విశేషం. సమంత వద్ద ఆరు లగ్జరీ కార్లున్నట్టు సమాచారం. వాటిలో రూ.72 లక్షల విలువలై జాగ్వర్ ఎక్స్ ఎఫ్ కారు, రూ.83 లక్షల విలువైన ఆడి క్యూ7, రూ.1.46 కోట్ల విలువైన స్వాంకీ పోర్చే కేమన్ కారుంది. వీటితోపాటు రూ.2.26 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారు, రూ.2.55 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జీ63, రూ.1.42 కోట్ల విలువలైన బీఎండబ్ల్యూ7 సిరీస్ కారు కూడా సమంత ఇంట్లో ఉండడం విశేషం. ఆమె మనోలో బ్లాక్ హై హీల్స్ వాడుతుంది. వీటి ధర ఏకంగా రూ.1 లక్ష ఉంటుందని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…