Kanmani Rambo Khatija Movie Review : ఆస‌క్తిక‌రంగా స‌మంత మూవీ.. రొమాంటిక్ డ్రామా అదిరింది..!

Kanmani Rambo Khatija Movie Review : అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత ఒక‌వైపు సినిమాలు, మ‌రో వైపు వెబ్ సిరీస్‌లు, మ‌రో వైపు ఫొటో షూట్స్ తో అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. స‌మంత న‌టించిన తాజా చిత్రం కాతు వాకుల రెండు కాదల్. ఈ మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో కన్మణి రాంబో ఖతీజా పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Kanmani Rambo Khatija Movie Review

క‌థ విష‌యానికి వ‌స్తే రాంబో (విజయ్ సేతుపతి) పుట్టడంతోనే అతని తండ్రి చనిపోతాడు. తల్లికి మతి స్థిమితం లేక‌ మంచానికే పరిమితం అవుతుంది. తమ వంశంలో ఎవ్వరికీ పెళ్లి కాదని, పెళ్లి అయినా కూడా ఏవో అశుభాలే జరుగుతాయనే ఊరి ప్రజల మూఢ నమ్మకాలను తొలగించేందుకు రాంబో తండ్రి ఓ అడుగు ముందుకు వేస్తాడు. పెళ్లి చేసుకుంటాడు.. తండ్రి కూడా అవుతాడు. కానీ రాంబో పుట్టిన మరుక్షణమే అతను చనిపోతాడు. దీంతో తమ నమ్మకమే నిజమని ఊరి ప్రజలంతా అనుకుంటారు. అలా రాంబో మేనత్త, బాబాయ్‌లు పెళ్లి కాకుండానే జీవితాన్ని కొనసాగిస్తుంటారు.

కనీసం చాకోబార్ ఐస్ క్రీమ్ పొందలేని దురదృష్ణవంతుడిగా ఫీలవుతాడు రాంబో. ఇక అందరికీ ఎంతో సులభంగా దొరికే వర్షం కూడా రాంబో మీద కురవదు. తాను దగ్గరగా ఉంటే కన్నతల్లికి కూడా ఏదో ప్రమాదం జరుగుతుందని రాంబో భావిస్తాడు. దీంతో రాంబో తన తల్లి కోసం, ఆమె క్షేమం కోసం ఊరు వదిలి వెళ్లిపోతాడు. దూరంగా పెరుగుతుంటాడు. అలాంటి రాంబో జీవితంలోకి కణ్మణి (నయనతార), ఖతీజా (సమంత)ల ఎంట్రీ ఎలా జరిగింది ? వారిద్దరూ రాంబో జీవితాన్ని ఎలా మార్చేశారు ? ఇద్దరినీ ఒకే సారి ప్రేమించిన రాంబో చివరకు ఏం చేశాడు ? అసలు ఒకే వ్యక్తిని ప్రేమించిన కణ్మణి, ఖతీజాలు చివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ? ఊరి ప్రజల మూఢ నమ్మకాన్ని, తమ వంశానికి ఉన్న శాపాన్ని రాంబో అధిగమించాడా ? అనేదే కథ.

విజయ్ సేతుపతి, సమంత, నయనతార ఈ ముగ్గురూ త‌మ పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు. ప్రపంచంలో అత్యంత దురదృష్ణవంతుడిగా విజయ్ సేతుపతి తనలో తాను బాధపడే సీన్స్‌లో అయినా, తనకు కావాల్సినవన్నీ దొరికిన సమయంలో సంతోష పడే సీన్స్‌లో అయినా విజయ్ సేతుపతి అద్భుతంగా నటించేశాడు. ఇక నయనతారకు కాస్త సాఫ్ట్ రోల్ ఇచ్చిన విగ్నేశ్ శివన్.. సమంతకు మాత్రం ఖతీజా రూపంలో కాస్త రఫ్ అండ్ టఫ్ పాత్రను ఇచ్చేశాడు.

ట్రయాంగిల్ లవ్ స్టోరీలను మనం ఇది వరకు ఎన్నో చూసి ఉంటాం. ఈ సినిమాలో కూడా రాంబో పాత్ర అలాగే ఉంటుంది. ప్రేమకే దూరమైన రాంబోకి.. ఒకే సారి ఇద్దరమ్మాయిలు ప్రేమిస్తున్నామ‌ని ప్రపోజ్ చేస్తారు. పైగా రాంబోకి ఆ ఇద్దరూ ప్రాణమే. ఆ ఇద్దరు వచ్చాకే తన జీవితం మారిపోయిందని అనుకుంటాడు. అలాంటి రాంబో ఆ ఇద్దరినీ కాదనలేకపోతాడు. అయితే ఈ సంఘర్షణను ప్రేక్షకుడి మనసును తాకేలా, హత్తుకునేలా మాత్రం విగ్నేశ్ శివన్ చేయలేకపోయాడు.

కణ్మణి, ఖతీజాల వైపు నుంచి కూడా ఆ ప్రేమను అంత బలంగా చూపించలేకపోయాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా సీరియస్‌నెస్ కనిపించదు. విగ్నేశ్ శివన్ స్టైల్‌లో మాదిరిగానే హాస్యాన్ని జోడిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలోని గాఢ‌తను మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అంత‌గా మెప్పించ‌లేద‌నిపిస్తోంది. కానీ కామెడీ కోసం ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM