Nithya Menen : అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఇటీవలి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా లేదు. 1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యా మీనన్.. 2008లో మలయాళ సినిమా ఆకాశ గోపురంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది మూవీలో కథానాయికగా తెలుగులో అడుగుపెట్టింది. అదే ఏడాది సిద్ధార్ధ్ హీరోగా నటించిన నూట్రెన్‌బంధు సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో 180 టైటిల్‌తో విడుదలైంది. మొత్తంగా 14 ఏళ్ల కెరీర్‌లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది. 2019లో నిత్యా మీనన్ .. హిందీ ఇండస్ట్రీకి మిషన్ మంగళ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా బాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. అటు హిందీలో అభిషేక్ బచ్చన్‌తో బ్రీత్ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసి దూకుడు చూపించిన స్టార్ హీరోయిన్.. ఆతరువాత డల్ అయ్యింది. ఇక అడపా దడపా స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్‌తో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. భీమ్లానాయక్ లో పవన్ భార్యగా నిత్య అలరించింది. ఈ పాత్రలో నిత్యమీనన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక నిత్య తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి అనుకుంటుంది.
కాగా అనుకున్నదే తడవుగా.. తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది నిత్యమీనన్. ఆమె తన సొంతంగా యూట్యూబ్ చానల్‌ను లాంచ్ చేసింది. దానికి నిత్య అన్‌ఫిల్టర్డ్ అని పేరు పెట్టింది. తన తొలి వీడియోను కూడా ఆ చానల్‌లో పోస్ట్ చేసింది. తన 12 ఏళ్ల కెరీర్‌కు చెందిన విషయాలను అందులో చెప్పింది. ఇక నిత్య ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్‌కు జడ్జిగా వ్యవహరిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…