Naga Chaitanya : నాగచైతన్య, సమంతల వ్యవహారం ఈ మధ్య కాలంలో మళ్లీ తెరమీదకు వచ్చింది. గతంలో వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు కొంత కాలం వీరు వార్తల్లో తెగ నానారు. అయితే కొన్ని రోజులకు ఆ వార్తలన్నీ సద్దుమణిగాయి. కానీ వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనేక కారణాలు మాత్రం తెలియలేదు. దానిపై ఇప్పటికీ పలు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా నాగచైతన్యపై మరో రూమర్ ప్రచారం అయింది.
గూఢచారి సినిమా ఫేమ్ శోభిత ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నాడని.. అందుకనే ఆమె ఉన్న హోటల్‌కు సైతం చైతూ వెళ్తున్నాడని.. ఆమెను తన ఫ్యామిలీకి కూడా చైతూ పరిచయం చేశాడని.. కనుక వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ.. కొన్ని వార్తలు ఈ మధ్య కాలంలో వైరల్ అయ్యాయి. అయితే వీటిని సమంతనే ప్రచారం చేయించిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ సమంత ఏమీ పట్టనట్లు ట్వీట్ పెట్టింది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలని చైతూ టీమ్ కొట్టి పారేసిందట. ఈ క్రమంలోనే చైతన్య కూడా ఈ వార్తలపై ఆగ్రహంగా ఉన్నాడట.

అసలు శోభిత ధూళిపాళతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ముందుగా హిందీ మీడియానే వార్తలను ప్రచురించింది. ఈ క్రమంలోనే వారిని తెలుగు మీడియా ఫాలో అయింది. కనుక హిందీ మీడియాపై చైతూ గుర్రుగా ఉన్నాడట. వారిపై ఆగ్రహంగా ఉన్న చైతూ గతంలో సమంతలా వారిపై కోర్టుకు వెళ్లనున్నాడట. అలా అని మళ్లీ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే చైతూ నటించిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీతోపాటు థాంక్ యూ అనే మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కృతిశెట్టితో కలిసి ఇంకో సినిమాలో కూడా చైతూ యాక్ట్ చేయనున్నాడు.