Charan And NTR : రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశీయులు సైతం ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. RRRను హాలీవుడ్ సినీ మేకర్స్ సైతం కొనియాడుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభను వారు ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే RRR సినిమా ఆస్కార్స్ బరిలో నిలుస్తుందని కూడా అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..
ఓ బడా ప్రొడ్యూసర్ RRR పేరిట ఓ రెస్టారెంట్‌ను ఓపెన్ చేస్తే బాగుంటుందని.. చరణ్, తారక్‌లను అడిగారట. ఇందులో రాజమౌళిని కూడా పార్ట్‌నర్‌ను చేద్దామని అడిగారట. అయితే ఇందుకు వారు ఓకే అయితే చెప్పలేదు. కానీ ఈ రెస్టారెంట్ ప్రతిపాదన బాగానే ఉందని అన్నారట. అయితే RRR పేరిట రెస్టారెంట్‌ను ప్రారంభించాలంటే.. ముందుగా మూవీ నిర్మాత డీవీవీ దానయ్యను కలవాలి. ఎందుకంటే హక్కులన్నీ ఆయన వద్దే ఉంటాయి కనుక ఆయనను కూడా ఇందులో పార్ట్‌నర్‌గా చేయాల్సి ఉంటుంది.

అయితే ఎన్‌టీఆర్, చరణ్‌లతో కలిసి RRR రెస్టారెంట్‌ను ఓపెన్ చేయించాలని చూస్తున్నారట. దీంతో బజ్ బాగానే క్రియేట్ అవుతుంది. రెస్టారెంట్‌కు కూడా మంచి పేరు వస్తుంది. RRR బ్రాండ్‌ను ఈ విధంగా ప్రమోట్ చేస్తూ.. మరోవైపు బిజినెస్‌లో లాభాలు గడించవచ్చు. నిజానికి ఇది మంచి ఆలోచనే. మరి ఇది కార్యరూపం దాలుస్తుందో.. లేదో.. చూడాలి.