Nag Ashwin : ఆదిపురుష్ ఎఫెక్ట్‌.. నాగ్ అశ్విన్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఏం చేయ‌నున్నారు..?

Nag Ashwin : నాగ్ అశ్విన్ మంచి టాలెంట్ ఉన్న‌ టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి లాంటి చిత్రాల‌తో త‌నేంటో నిరూపించుకున్నాడు. ప్రియాంక‌ ద‌త్ భ‌ర్త‌గా, టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత అశ్వినీ ద‌త్ కి అల్లుడిగా కూడా చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈయ‌న ప్రాజెక్ట్ కె పేరుతో దేశంలోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్, దీపికా ప‌దుకొనెల‌తోపాటు అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటివారు ముఖ్య పాత్ర‌లు చేస్తున్నారు.

అయితే ఇంత ప్ర‌తిష్టాత్మంకంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికి వ‌ర‌కు ఎటువంటి అప్ డేట్ గానీ ప్ర‌క‌ట‌న‌గానీ రాక‌పోవ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి చెందిన ఎటువంటి స‌మాచారం బ‌య‌టికి చెప్ప‌కుండా ర‌హ‌స్యంగా ఉంచుతున్నార‌ని టాక్ న‌డుస్తుంది. కానీ ఈ ప‌ద్ద‌తి సినిమాకు మంచిది కాద‌ని, ఇలా సీక్రెట్ గా ఉంచ‌డం వ‌ల‌న‌ ఆదిపురుష్ విష‌యంలో జ‌రిగినట్టుగా ఎదురు దెబ్బ తినాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఆది పురుష్ సినిమాను కూడా ఇదే విధంగా గొప్ప క‌ళా ఖండం తీస్తున్నామ‌ని ఊహించుకొని టీజ‌ర్ విడుద‌ల అయ్యేంత వ‌ర‌కు అన్ని విష‌యాలు ర‌హ‌స్యంగా ఉంచ‌డం జ‌రిగింది. ఎటువంటి పోస్ట‌ర్లు గానీ, గెట‌ప్ లు గానీ ముందుగా చూపించ‌లేదు. ఒక్కసారిగా టీజ‌ర్ వ‌ద‌ల‌డంతో అంద‌రూ షాక్ కు గుర‌య్యారు. దానిలోని పాత్ర‌లు, యానిమేష‌న్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా మందికి ఏ మాత్రం న‌చ్చ‌లేదు. దాంతో ఆది పురుష్ ను బ్యాన్ చేయాల‌ని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Nag Ashwin

ఈ క్ర‌మంలోనే ప్రాజెక్ట్ కె మూవీకి సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు, పోస్ట‌ర్లు, మేకింగ్ సీన్లు, గెట‌ప్ లు చూపించాల‌ని నాగ్ అశ్విన్ కు కొంద‌రు సూచిస్తున్నారు. క‌నీసం ఏవైనా అప్ డేట్ లు అయినా ఇవ్వాల‌ని చెబుతున్నారు. దాని వ‌ల‌న సినిమా నుండి ఏం ఆశించాలో ప్రేక్ష‌కుల‌కు ఒక అభిప్రాయం ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో వారి స్పంద‌న‌ను బ‌ట్టి సినిమాలో ఏవైనా మార్పులు చేయ‌డానికి కూడా వీల‌వుతుంద‌ని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప‌, కెజీఎఫ్ చిత్రాల‌కు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు క్యారెక్ట‌ర్ల‌ను, పోస్ట‌ర్ల‌ను విడుదల చేశార‌ని గుర్తు చేస్తున్నారు.

ప్రాజెక్ట్ కె టీమ్ కూడా ఇప్ప‌టికైనా మేల్కొని సినిమా క‌థ‌కు సంబంధించి కానీ, క్యారెక్ట‌ర్ల‌కు సంబంధించి కానీ ప్ర‌క‌ట‌న చేయాల‌ని సూచిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల‌న ప్రేక్ష‌కుల‌కు సినిమాకు మ‌ధ్య పార‌ద‌ర్శ‌క‌త పెరిగి సినిమా విజ‌యానికి దోహ‌దం చేస్తుంద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. లేక‌పోతే ఆది పురుష్ ఎదుర్కున్న ప‌రిస్థితుల‌నే చూడాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Share
Prathap

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM