Simhadri Movie : దర్శకధీరుడు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే రాజమౌళి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఇప్పటి వరకూ ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా రాజమౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. జక్కన్నకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తో ఆయన సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు.
కానీ ఒకప్పుడు జక్కన్న నుండి ఆఫర్ వచ్చినా కొంతమంది మిస్ చేసుకున్నారు. వాళ్లు ఎవరంటే.. జక్కన్న మొదట సింహాద్రి కథను రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయాలని అనుకున్నాడట. దాంతో ప్రభాస్ కు ఈ సినిమా కథను కూడా వినిపించాడట. కానీ ప్రభాస్ మాత్రం సింహాద్రి సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశాడట. అంతే కాకుండా సింహాద్రి కథ నందమూరి నట సింహం బాలయ్య బాబుకు చాలా బాగా సెట్ అవుతుందని కూడా రాజమౌళి అనుకున్నారట.
ఆయనకు కూడా ఈ సినిమా కథను వినిపించారట. కానీ బాలయ్య మాత్రం ఈ సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదట. ఇక చివరగా జక్కన్న ఇదే కథను ఎన్టీఆర్ కు వినిపించారు. ఈ సినిమా కథ ఎన్టీఆర్ కు తెగ నచ్చేసింది. దీంతో ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయారు. ఇక స్టూడెంట్ నంబర్ వన్ తరువాత సింహాద్రితో ఎన్టీఆర్ జక్కన్న కాంబోలో మరో సూపర్ హిట్ పడింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…