Mrunal Thakur : మృణాల్ ఠాకుర్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. మొదట్లో హిందీ సీరియల్స్ లో నటించి సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకుంది మృణాల్. ఈ చిత్రంలో యువరాణిలా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి తెలుగు చిత్రంతోనే మృణాల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే ఆమె వైజయంతి బ్యానర్‌లో ఓ సినిమాకు సంతకం చేసిందని, మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా నిజానికి మృణాల్ ఠాకూర్ ఇప్పటికే పాన్ ఇండియా చిత్రాలలో నటించాల్సి ఉండగా ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు.. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్ ను మృణాల్ మిస్ చేసుకుంది. 2015 లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. హీరో ప్రభాస్ మరియు డైరెక్టర్ రాజమౌళి క్రేజ్ బహుబలి చిత్రంతో వంద రెట్లు పెరిగిపోయింది.
అయితే ఈ సినిమాలో మృణాల్ చాన్స్ మిస్ చేసుకుంది హీరోయిన్ గా కాదు. సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో నటించే ఛాన్స్ ను మృణాల్ కోల్పోయింది. జక్కన్న బాహుబలి సినిమా కోసం ముంబైలో కూడా ఆడిషన్స్ నిర్వహించారట. ఆ ఆడిషన్స్ లో మృణాల్ ను ఎంపిక చేశారట. కానీ ఆ తరవాత ఏమైందో తెలియదు గానీ రాజమౌళి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలా ఫైనల్ గా శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేయడం జరిగిందట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…