GodFather 2022 Movie Review : ఆచార్య ఫెయిల్యూర్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరోమారు గాడ్ ఫాదర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుంచీ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గాడ్‌ఫాదర్ ట్రైలర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ ద్వారా హిట్ పడినట్లే అని భావించారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో అంచనాలు ఒక రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 5, శుక్రవారం గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. అందరి అంచనాలను అందుకుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గాడ్ ఫాదర్ మూవీ కథ..
సీఎం పీకేఆర్ మరణంతో సినిమా మొదలవుతుంది. ఆయన మరణం అనంతరం రాష్ట్రానికి ఎవరు సీఎం అని అందరూ చర్చించుకుంటారు. ఆయన పార్టీలో ఉన్న ప్రముఖ నేతలు నేనే సీఎం కావాలి అంటే.. నేనే కావాలి.. అని వ్యూహాలు పన్నుతుంటారు. ఈ క్రమంలోనే బ్రహ్మ (చిరంజీవి) ఎంటర్ అవుతాడు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోతాయి. అయితే పీకేఆర్ అల్లుడు (సత్యదేవ్) చాలా శక్తివంతమవుతాడు. రాష్ట్రంలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాడు. అలాగే చీకటి వ్యాపారాలకు పెద్ద ఎత్తున తెర తీస్తాడు. అయితే అతని గురించి ఓ కఠోర నిజాన్ని తెలుసుకుంటారు. దీంతో కథ మొత్తం మారిపోతుంది. చివరకు బ్రహ్మ ఏం చేస్తారు.. సత్యదేవ్‌కు చెక్ పెడతారా.. సీఎం ఎవరు అవుతారు.. కథ ఏమవుతుంది.. పీకేఆర్‌కు, బ్రహ్మకు సంబంధం ఏమిటి.. అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
గాడ్‌ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి సూపర్బ్‌గా యాక్ట్ చేశారనే చెప్పాలి. ఆయనకు తోడు సల్మాన్ ఖాన్, నయనతార, సముద్రఖని, సత్యదేవ్ లాంటి వారు తమ పాత్రలకు 100 శాతం న్యాయం చేశారు. ఇది రీమేక్ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా తెరకెక్కించారు. అందువల్ల చిరంజీవి పలికే డైలాగ్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను ప్రతిబింబిస్తాయి. ఇక సినిమాలో సీన్ సీన్‌కు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ కలుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు మోహన్ రాజా తన ప్రతిభను కనబరిచారు.
అలాగే సినిమా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. చిరంజీవితోపాటు సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లను కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ చిరు అభిమానులకు పండుగ వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ వారం గడిస్తే కానీ.. సినిమా హిట్టా.. ఫ్లాపా.. అన్న విషయం తెలియదు. కనుక మూడు రోజుల వరకు వేచి చూడక తప్పదు. ఇక కొత్తదనం కోరుకునే వారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…