Actress Hema : నటి హేమ అంటే అందరికీ సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. హేమ బిగ్ బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది. కొన్ని రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈమె నటిగానే కాకుండా అప్పుడప్పుడూ వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అయితే ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు. ప్రశాంతత కోసం.. గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్స్ కోసం వెళతాం.. కొంచెమైనా మనసు ప్రశాంతంగా ఉండడానికి.. మన తలపై ఉన్న భారం దించుకోవడానికి గుడికి వెళ్తాం..
అయితే తాజాగా హేమ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హేమ ఆగ్రహంతో ఊగిపోయింది. అమ్మవారి సన్నిధిలో ఆమె మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని చూడలేను ఏమో అనుకున్నాను. కానీ ఆ అమ్మవారే నన్ను తన దగ్గరికి రప్పించుకుంది అంటూ చెప్పుకొచ్చింది.
ఇదే టైం లో ఓ రిపోర్టర్ మీరు టికెట్స్ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించగా.. ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది హేమ. ఏంటీ.. గుడిలో కూడా కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారా.. అమ్మవారికి రూ.20 వేలు పెట్టి చీర తెచ్చాను. రూ.10 వేలు హుండీలో వేశాను. అయినా టికెట్ గురించి అడుగుతున్నారా మీరు.. నేను ప్రోటోకాల్ ప్రకారమే అన్ని ఫాలో అవుతున్నాను. నేను దుర్గమ్మ భక్తురాలిని. అమ్మవారి కోసమే ఇక్కడికి వచ్చాను కాంట్రవర్సీ కోసం కాదు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…