OTT : వారం వారం థియేటర్లలోనే కాదు.. ఓటీటీల్లోనూ కొత్త మూవీలు సందడి చేస్తున్నాయి. కరోనా వల్ల ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కనుకనే థియేటర్లకు వెళ్లి మరీ అధిక ధరలకు టిక్కెట్లను కొని చూడాలంటే వెనుకడుగు వేస్తున్నారు. దీంతో థియేటర్లకు కష్టకాలం వచ్చింది. అయితే ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. కానీ ఎట్టకేలకు దీన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ జూలై 22వ తేదీన స్ట్రీమ్ కానుంది. సోనీ లివ్ యాప్ లో ఈ మూవీని చూడవచ్చు. అలాగే ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్, సౌత్ స్టార్ ధనుష్ నటించిన హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ ఈ నెల 22వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విజయవంతంగా కొనసాగిన పరంపర సిరీస్ ఇప్పుడు మళ్లీ రెండో సీజన్ ద్వారా అలరించనుంది. దీన్ని జూలై 21 నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులో జగపతిబాబు, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ నటించిన ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే ఒరిజినల్ మూవీ ఆహాలో రిలీజ్ అవుతోంది. దీన్ని జూలై 22న రిలీజ్ చేయనున్నారు. ఇక మీమ్ బాయ్స్ అనే తమిళ కామెడీ డ్రామాను సోనీ లివ్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఇక ఈ వారం ఎఫ్3, ది గ్రే మ్యాన్ తప్ప అంతగా ఆకట్టుకునే సినిమాలు ఏవీ ఓటీటీల్లో లేవనే చెప్పాలి.