OTT : వారం వారం ఓటీటీల్లో సరికొత్త సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం విదితమే. అందుకనే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లడం మానేశారు. ఓటీటీల్లో సినిమాలను చూసేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇక ఓటీటీ యాప్స్ కూడా ప్రేక్షకుల అభిరుచుల మేరకు కొత్త సినిమాలు, సిరీస్‌లను వారం వారం విడుదల చేస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా పలు మూవీలు సందడి చేయనున్నాయి. అయితే ఈ వారం తెలుగు మూవీలు ఓటీటీల్లో ఏమీ విడుదల కావడం లేదు. అయినప్పటికీ వివిధ భాషలకు చెందిన పలు ఆసక్తికరమైన మూవీలను ఈ వారం ఓటీటీల్లో చూడవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ క్రైమ్ డ్రామా సిరీస్ అయిన ఇండియన్ ప్రిడేటర్.. ది డైరీ ఆఫ్ ఎ సీరియల్ కిల్లర్ అనే సిరీస్‌ను ఈ నెల 8వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇక మళయాళం సూపర్ స్టార్ సురేష్ గోపి నటించిన పాప్పన్ అనే మూవీ ఈనెల 7వ తేదీన జీ5 యాప్ లో స్ట్రీమ్ కానుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మూవీ థోర్.. ది లవ్ అండ్ థండర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా ఈ నెల 8వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. అలాగే ఈమధ్యే విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఏక్ విలన్ అనే బాలీవుడ్ మూవీ కూడా ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.
ఇక హాలీవుడ్‌కు చెందిన బిగ్ బడ్జెట్ యాక్షన్ డ్రామా మూవీ.. ఒబి-వాన్ కెనొబి ది జెడిస్ రిటర్న్ కూడా ఈ నెల 8వ తేదీన రిలీజ్ కానుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ వారం తెలుగు మూవీలు, సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజ్ అయ్యేవి ఏమీ లేకపోయినా.. ఈ మూవీలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…