Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయిన విషయం తెలిసిందే. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లతో టచ్‌లో ఉండేది. పైగా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ఎంతో మందికి సాయం చేసి మంచి మనసును చాటుకుంది రేణూ దేశాయ్. కరోనా తరువాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది.
తాజాగా రేణు దేశాయ్ ఇన్ స్టా లో చేసిన పోస్ట్ లు ఆమె రెండవ వివాహం గురించి చర్చకు దారితీశాయి. జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. మరో పోస్ట్ లో.. మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అంటూ కామెంట్ పెట్టింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ రెండో పెళ్లికి సంబంధించిన విషయంపై చర్చ నడుస్తుంది. అయితే గతేడాది రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసిన రేణు.. అతడి చేతికి ఉన్న రింగ్ ను చూపించేలా ఫోటో పెట్టింది. అలాగే గతేడాది ఆలీతో సరదాగా షో కి వచ్చిన రేణూదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడని.. ముందు అతడు అమెరికాలో ఉద్యోగం చేసే వాడని, వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది. తర్వాత అతని గురించి ఏ విషయం రివీల్ చేయలేదు. అయితే రేణూదేశాయ్ ఆ వ్యక్తినే వివాహం చేసుకోనుందా, లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…