Movie Review Laxman : రివ్యూయర్‌ లక్ష్మణ్‌.. రివ్యూలు చెప్పేటప్పుడు చేసే యాక్షన్.. నిజమా.. అబద్ధమా..?

Movie Review Laxman : ఆయన కెమెరా ముందు నిలుచుని మైక్‌ ఎదురుగా పెట్టుకుని సినిమాలకు రివ్యూలు ఇస్తుంటే.. ఎవరైనా సరే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వాల్సిందే. అవును.. ఈ పాటికే ఆయన ఎవరో మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది. యెస్‌.. ఆయనే రివ్యూయర్‌ లక్ష్మణ్‌. ఈయన యూట్యూబ్‌లో బాగా పాపులర్‌. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలను చూసేవారికి ఈయన గురించి బాగానే తెలుసు. అయితే విశ్వక్‌సేన్‌ చేసిన ప్రాంక్‌ వీడియోలో నటించినందుకు గాను రివ్యూయర్‌ లక్ష్మణ్‌ అంటే ఎవరో తెలియని వారికి కూడా తెలిసిపోయింది. ఈయన ప్రస్తుతం బాగా పాపులర్‌ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

విశ్వక్‌సేన్‌ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీకి అంత హైప్‌, పబ్లిసిటీ రాకపోయేది. కానీ విశ్వక్‌ సేన్‌ చేసిన ప్రాంక్‌ వీడియో కారణంగా ఓ టీవీ చానల్‌లో యాంకర్‌ దేవి డిబేట్‌ పెట్టడం.. తరువాత ఆమె విశ్వక్‌ సేన్‌ను తిట్టడం.. వంటి సంఘటనల కారణంగా విశ్వక్‌కు సానుభూతి వచ్చింది. నెటిజన్లందరూ దేవినే తప్పుబట్టారు. ఈ క్రమంలోనే అశోకవనంలో సినిమాకు కూడా కావల్సినంత పబ్లిసిటీ లభించింది. అయితే దీని వల్ల రివ్యూయర్‌ లక్ష్మణ్‌ కూడా పాపులర్‌ అయ్యారు. అంతకు ముందు కేవలం యూట్యూబ్‌ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఈయన ఇప్పుడు అందరికీ పరిచయం అయ్యారు. ఇక తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రివ్యూలు చెప్పే సమయంలో ఓవర్‌ యాక్షన్‌ చేస్తానని అందరూ అనుకుంటారని.. కానీ అది నిజం కాదని.. సినిమా గురించి తాను ఏం ఫీలైతే అదే చేసి చూపిస్తానని.. కనుక రివ్యూ చెప్పే సమయంలో తన హావభావాలు, ఓవర్‌ యాక్షన్‌ అంతా డూప్‌ కాదని.. నిజమే అని అన్నారు. అలాగే ఇంకొన్ని విషయాలను కూడా వెల్లడించారు.

Movie Review Laxman

రివ్యూలు చెప్పేందుకు తన ఎవరూ డబ్బులు ఇవ్వరని.. సినిమా చూసి దాని స్థితికి అనుగుణంగా రివ్యూ చెబుతానే కానీ.. ఫేక్‌ రివ్యూలు చెప్పనని తెలిపారు. ఇక విశ్వక్ సేన్‌ ప్రాంక్‌ వీడియోకు మాత్రం డబ్బులు ఇచ్చారని.. కానీ దాని వల్ల తమ ఇమేజ్‌ పెరిగిందని తెలిపారు. దాని వల్ల తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందేమోనని భయపడ్డానని కానీ అలా జరగలేదన్నారు. ఇక సినిమా రివ్యూలు చెప్పే సమయంలో తనకు ఒక ఎగ్జయిట్‌మెంట్‌, ఉత్సాహం ఉంటాయని.. అందుకనే చాలా ఫీలవుతూ అలా రివ్యూలు చెబుతానని.. అవన్నీ ఫేక్‌ కాదని.. నిజమే అని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM