Puri Jagannadh : మ‌హేష్ బాబుకు.. పూరీ జ‌గ‌న్నాథ్ కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిందా ?

Puri Jagannadh : మ‌హేష్ న‌టించిన లేటెస్ట్ చిత్రం స‌ర్కారు వారి పాట బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించి వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇందులో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టించింది. స‌ముద్రఖ‌ని విల‌న్ పాత్ర‌లో క‌నిపించారు. రివ్యూల‌తోపాటు సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తున్నందున ఓపెనింగ్స్ కూడా బాగానే వ‌చ్చాయి. ఇక వీకెండ్‌లో ఇంకా ఎక్కువ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంద‌ని ఆశిస్తున్నారు. అయితే ఈ మూవీ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్యంగా పూరీ జ‌గ‌న్నాథ్‌, మ‌హేష్ బాబుల‌కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిందా.. అని అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాలు చెప్పారు.

గ‌తంలో మ‌హేష్, పూరీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పోకిరి, బిజినెస్‌మ్యాన్ చిత్రాలు ఘ‌న విజ‌యాన్ని సాధించాయి. పోకిరి సినిమా అయితే మ‌హేష్ కెరీర్ లో అప్ప‌ట్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అందులో మ‌హేష్‌కు జోడీగా మొద‌ట్లో అయేషా ట‌కియాను తీసుకోవాల‌ని పూరీ అనుకున్నారు. కానీ ఆ అవ‌కాశం ఇలియానాను వ‌రించింది. దీంతో ఆ మూవీతో ఇలియానా ద‌శ తిరిగి పోయింది. అనేక సినిమాల్లో ఆమెకు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే మ‌హేష్, పూరీ కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ సినిమా రాలేదు. దీంతో వారి మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని.. అందుక‌నే చాలా గ్యాప్ వ‌చ్చింద‌ని.. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై ప‌ర‌శురామ్ క్లారిటీ ఇచ్చారు.

Puri Jagannadh

మ‌హేష్‌, పూరీ జ‌గ‌న్నాథ్‌ల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని మీరు భావిస్తున్నారా.. అని అడిగిన ప్ర‌శ్న‌కు ప‌ర‌శురామ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేద‌న్నారు. మ‌హేష్ ద‌ర్శ‌కుల‌ను మారుస్తూ సినిమాలు చేస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తున్నారు. అందువ‌ల్ల పూరీతో సినిమా మ‌ళ్లీ చేయ‌లేక‌పోతున్నారు. లేదంటే మ‌హేష్‌, పూరీ కాంబినేష‌న్‌లో మ‌రిన్ని చిత్రాలు వ‌చ్చేవి. అయినా స‌రైన క‌థ దొర‌కాలే కానీ.. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ అవుతుంద‌ని.. ఆశిస్తున్నాన‌ని తెలిపారు.

ఇక ప‌ర‌శురామ్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పేశారు. తాను వాస్త‌వానికి మ‌హేష్ మ‌హ‌ర్షి మూవీ స‌మయంలోనే ఆయ‌న‌కు స‌ర్కారు వారి పాట క‌థ చెప్పాన‌ని.. దీంతో ఓకే చేశార‌ని.. అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు వెంట‌నే చేయాల్సి వ‌చ్చింద‌ని.. క‌నుక ఆ మూవీ త‌రువాత స‌ర్కారు వారి పాట చేశామ‌ని తెలిపారు. అయితే మ‌హేష్ తో ఈ మూవీ ఆల‌స్యం అవుతుంది క‌నుక ముందుగా చైతూతో 14 రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో సినిమా చేద్దామ‌ని చైత‌న్య‌ను సంప్ర‌దించాన‌ని ఆయ‌న ఓకే చెప్పార‌ని తెలిపారు.

అయితే స‌డెన్‌గా మ‌హేష్ స‌ర్కారు వారి పాట చేద్దామ‌ని అన్నార‌ని.. దీంతో చైత‌న్య‌ను త‌రువాత సినిమా చేద్దామ‌ని రిక్వెస్ట్ చేశానని.. మ‌హేష్‌తో మ‌ళ్లీ అవ‌కాశం రాదేమోన‌ని.. క‌నుక మీ సినిమా నేను త‌రువాత చేస్తాన‌ని చైతూకు చెప్పాన‌ని.. దీంతో చైతూ సానుకూలంగా స్పందించార‌ని.. ఆయ‌న ఓకే చెప్పాకే స‌ర్కారు వారి పాట‌కు తాను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాన‌ని.. అలా ఈ మూవీని తెర‌కెక్కించామ‌ని ప‌ర‌శురామ్ తెలిపారు. ఈ క్రమంలోనే మ‌హేష్, పూరీల మ‌ధ్య ఉన్న విష‌యాల‌పై ప‌ర‌శురామ్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM