Mega Fans vs Mahesh Fans : మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం.. ఆచార్య. ఈ మూవీ ఏప్రిల్ 29వ తేదీన భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయింది. మొత్తంగా చూస్తే రూ.84 కోట్ల మేర నిర్మాతలకు ఈ మూవీ నష్టాలను తెచ్చి పెట్టిందని అధికారిక లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతోంది. అయితే ఆచార్య ఫ్లాప్ కావడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కారణాలు ఏమున్నప్పటికీ ఆచార్య మూవీ ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే సినిమా బంపర్ హిట్ అయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కూడా చేసుకున్నారు. ఇక తొలి రోజు ఈ మూవీ ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్‌ను వరల్డ్ వైడ్‌గా సాధించిందని.. ఇది ఒక తెలుగు సినిమాకు ఒక రోజుకు లభించిన అధిక మొత్తాల్లో ఒకటని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే దీనిపై మెగాఫ్యాన్స్ మండిపడుతున్నారు. మహేష్ బాబు ఫేక్ కలెక్షన్స్ చూపెడుతున్నారని ఆరోపిస్తూ.. వారు సోషల్ మీడియాలో #SVPFakeCollections అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.
అయితే ఇందుకు ప్రతిగా మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. వారు ఏకంగా #MegaFamilyRankuMogudu అని చెప్పి ఇంకో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో మెగా ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీ హీరో వేస్ట్.. అంటే.. మీ హీరోనే వేస్ట్.. అని ఫ్యాన్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఆచార్యకు మహేష్ వాయిస్ ఓవర్ అందించారు. అయినప్పటికీ ఆయనను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకనే తాము మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశామని.. అలాగే తప్పుడు కలెక్షన్లని చెబుతూ ఆరోపణలు చేస్తున్నారని.. కనుకనే తాము మెగాఫ్యామిలీకి చెందిన హ్యాష్ ట్యాగ్ పేరిట ట్వీట్స్‌ను ట్రెండ్ చేస్తున్నామని.. మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ గొడవ ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…