Pragathi : సోషల్ మీడియాకు రోజు రోజుకీ విపరీతమైన ఆదరణ పెరిగిపోతుండడంతో చాలా మంది అందులో కాలక్షేపం చేస్తున్నారు. తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలు, వార్తలను చదువుతూ ఆ ప్రపంచంలో చాలా సమయం గడిపేస్తున్నారు. దీంతో నెటిజన్లను అలరించడం కోసం.. ఫాలోవర్ల సంఖ్యను, పాపులారిటీని పెంచుకోవడం కోసం హీరోయిన్లు, నటీమణులు అనేక కష్టాలు పడుతున్నారు. తమ గ్లామర్‌ను అందుకు ఎరగా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా ఫొటోలను పోస్ట్ చేసే నటీమణుల సంఖ్య ఎక్కువైంది. కేవలం వెండితెర మాత్రమే కాదు, బుల్లితెర నటులు కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, చిన్న చిన్న వేషాలు వేసేవారు కూడా తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే కోవలో నటి ప్రగతి కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను అందులో షేర్ చేస్తూ ట్రీట్ ఇస్తోంది.
నటి ప్రగతి ఓవైపు సినిమాలతోపాటు మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈమధ్యే ఈమె తన బర్త్ డేను జరుపుకోగా.. ఆ పార్టీకి కేక పెట్టించే డ్రెస్ ధరించింది. అనంతరం తన ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఆమెకు పాజిటివ్ కన్నా నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వచ్చాయి. బర్త్ డే చేసుకుంటే చేసుకున్నారు, కాస్త మంచి దుస్తులు ధరించవచ్చు కదా.. అని కొందరు కామెంట్లు చేస్తే.. ఈ వయస్సులో మీకు ఇవన్నీ అవసరమా.. అని ఇంకొందరు కామెంట్లు చేశారు. అయినప్పటికీ నటి ప్రగతి వాళ్లను పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోతోంది. ఇక ఈమె ఫిట్‌నెస్ పై కూడా దృష్టి సారిస్తుంటుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే తరచూ జిమ్‌లలో గంటల తరబడి సాధన చేస్తుంటుంది. తన జిమ్ సెషన్‌లకు చెందిన ఫొటోలు, వీడియోలు కూడా ఈమె షేర్ చేస్తుంటుంది. ఇక లేటెస్ట్‌గా ఈమె షేర్ చేసిన ఫిట్‌నెస్ సెషన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
నటి ప్రగతి ఫిట్‌నెస్ పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఈ వయస్సులోనూ ఆమె ఇలా ఉన్నారంటే.. అందుకు ఆమె చేసే వర్కవుట్సే కారణమని చెప్పవచ్చు. జిమ్‌లో గంటల తరబడి ఆమె వర్కవుట్స్ చేస్తుంటుంది. అందులో భాగంగానే ఆమె చేసిన వర్కవుట్స్ చెందిన లేటెస్ట్ ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆమె ఫిట్‌నెస్, వర్కవుట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…