Upasana : మెగా పవర్ స్టార్‌గా రామ్ చరణ్ తేజ తండ్రికి తగ్గ తనయుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. ఆయన నటుడిగానే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఆయన భార్య ఉపాసన కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈమె మూగ జీవాలపై ప్రేమ కురిపిస్తుంటారు. హైదరాబాద్‌లోని జూ పార్క్‌లో ఉన్న పలు జంతువుల సంరక్షణను ఈమె స్వయంగా చూసుకుంటున్నారు. అందుకు అయ్యే ఖర్చును కూడా ఈమె స్వయంగా భరిస్తున్నారు.
ఇక ఉపాసన 200 వృద్ధ, అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకుని వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. అందులో భాగంగానే ఈమె ఈ మధ్య కొందరు వృద్ధ మహిళలో సరదాగా గడిపిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అలాగే ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్‌గా ఉన్నారు. దీంతోపాటు రామ్ చరణ్ కు చెందిన పలు వ్యాపారాలను కూడా ఆమె చూసుకుంటుంటారు. అయితే ఆమె ఏడాది సంపాన ఎంత ? అని సహజంగానే చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మరి దానికి సమాధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కొణిదెల ఉపాసన ఏడాదికి దాదాపుగా రూ.30 కోట్లను సంపాదిస్తారని సమాచారం. కానీ సామాజిక సేవా కార్యక్రమాలకే ఎక్కువగా ఆమె ఖర్చు చేస్తుంటారు. దీంతో ఆమె అందరి ప్రశంసలను పొందుతుంటారు. ఇక ఉపాసన ఇటీవలే చెన్నై వెళ్లగా అక్కడ ఆమె కోవిడ్ బారిన పడ్డారు. దీంతో వారం పాటు హాస్పిటల్‌లో ఉండి చికిత్స పొందారు. ఈ క్రమంలోనే తనకు చికిత్సను అందించిన వైద్యులకు ఆమె సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…