Moto G71 5G : ప్రస్తుతం వినియోగదారులు మార్కెట్‌లో 5జి ఫీచర్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ఎక్కువగా చూపిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా 5జి ఫీచర్ ఉన్న ఫోన్లను అత్యంత తక్కువ ధరలకే అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఇక తాజాగా మోటోరోలా కంపెనీ ఇదే కోవలో ఓ 5జి ఫోన్‌ను లాంచ్ చేసి తక్కువ ధరకే అందిస్తోంది.
మోటోరోలా సంస్థ మోటో జి71 5జి పేరిట ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అమర్చారు. దీని వల్ల 5జికి సపోర్ట్ లభిస్తుంది. అలాగే 6జీబీ ర్యామ్ లభిస్తుంది. అవసరం అనుకుంటే మరో 2జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. త్వరలోనే ఆండ్రాయిడ్ 12కు అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌కు వెనుకవైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అలాగే 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాను కూడా వెనుక వైపు ఇచ్చారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఇందులో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక వైపు ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ లభిస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ చార్జింగ్ 20 నిమిషాల్లో 50 శాతం, ఒక గంటలో 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
మోటో జి71 5జి ఫోన్ నెప్‌ట్యూన్ గ్రీన్, ఆర్కిటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.18,999గా ఉంది. జనవరి 19వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.