moto g62 5g : మొబైల్స్ తయారీదారు మోటోరోలా మార్కెట్‌లోకి మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. మోటో జి62 5జి పేరిట ఆ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్ లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అమర్చారు. 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను అందిస్తున్నారు. అలాగే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 3 ఏళ్ల వరకు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు మోటోరోలా తెలియజేసింది.

ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. దీనికి తోడు మరో 8 మెగాపికల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల సౌండ్ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంట్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. దీనికి టర్బో చార్జింగ్ ఫీచర్ ను అందిస్తున్నారు.
మోటో జి62 5జి స్మార్ట్ ఫోన్ ఫ్రాస్టెడ్ బ్లూ, మిడ్‌నైట్ గ్రే కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఆగస్టు 19 నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై రూ.1500 వరకు డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు.