కర్ణాటకలోని బెంగుళూరులో వికలాంగురాలైన నాలుగేళ్ల చిన్నారిని నాలుగవ అంతస్తు నుంచి తోసేసి చంపేసింది ఓ కన్న తల్లి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కిరణ్, సుష్మ భరద్వాజ్ అనే దంపతులు నివసిస్తున్నారు. భర్త కిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, భార్య సుష్మ డెంటిస్ట్. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది.
ఈ చిన్నారి ఎదుగుదల పుట్టినప్పటి నుంచి సరిగా లేదు. చిన్నారి మాట్లాడలేదు. మెదడు ఎదుగుదల సరిగా లేని బాలిక పరిస్థితిని చూసి ఆమె తల్లి సుష్మ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. దీంతో శుక్రవారం సాయంత్రం తల్లి సుష్మ తన ఇంటి నాలుగో అంతస్తు బాల్కనీలో తన బిడ్డను చేతుల్లో పట్టుకుని నిల్చుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని కిందకు తోసేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
నిందితురాలు సుష్మా భరద్వాజ్ తన బిడ్డను విసిరివేసిన అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందని, అయితే ఇరుగుపొరుగు వారు రక్షించారని పోలీసులు తెలిపారు. సుష్మా భర్త కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా సుష్మ భరద్వాజ్ తన కూతురిని రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న కిరణ్ వెంటనే స్టేషన్‌కు చేరుకుని తమ కుమార్తెను గుర్తించాడని పోలీసులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…