టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ గా పరిచయం అవుతుంటారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం ఎక్స్‌పోజింగ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అటు సినిమాలలోనూ, ఇటు యాడ్స్ లోనూ నటిస్తూ కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా చిత్రంలో చేసే క్యారెక్టర్ కు మాత్రమే ప్రత్యేకత గుర్తింపు ఉండాలని భావిస్తూ ముందుకు దూసుకుపోతోంది లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి.
ఫిదా చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అభినయంతోనే అనేకమంది అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక హీరోయిన్ సాయి పల్లవి. తను చేసే చిత్రాలలో పాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే హీరోయిన్ సాయి పల్లవి. తనకంటూ ఒక బౌండరీ గీసుకొని, ఎంత డబ్బు ఎర చూపినా కూడా తల వంచకుండా ఆమె అనుకున్న పని చేసే తీరుతుంది. పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా కూడా తనకు కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నిరాకరిస్తుంది.
ఎంత మంచి కథ, బడా నిర్మాణ సంస్థ అయినా కూడా గ్లామర్ షోకి నో చెబుతూ నిర్మొహమాటంగా ఎన్నో అవకాశాలను వదిలేసింది. సాయి పల్లవి తరహా చూస్తే ఖచ్చితంగా ఈ కాలం ఉండాల్సిన అమ్మాయి అయితే కాదు. ఇప్పటి తరం హీరోయిన్స్ తో పోలిస్తే ఆ స్పీడ్, వాళ్ల స్టైల్ సాయి పల్లవిలో లేవనే చెప్పవచ్చు. ఈమె పద్ధతులు, ఆచరణలు అంజలీదేవి, రాజసులోచన కాలంనాటి తారలను గుర్తుకు తెస్తాయి. ప్రస్తుతం విరాటపర్వం, గార్గి వంటి చిత్రాలతో వరుస పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.
చిరంజీవి లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్పి ఎక్కడ కూడా ఏమాత్రం భయం లేకుండా తన పని తను చేసుకుపోతోంది. సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా తనకంటూ రూ.10 లక్షలు కూడా ఖర్చు పెట్టుకోలేదు. అంతేకాకుండా ఆమె సిద్ధాంతాల ద్వారా కేవలం దర్శకుడు చెప్పినట్లు నటించాలనే రూల్స్ ను బ్రేక్ చేసింది సాయిపల్లవి. వచ్చిన అవకాశాలని వదులుకుంటూ దాదాపు రూ.50 కోట్ల వరకు నష్టపోయిందని సినిమా వర్గాలలో టాక్ వినిపిస్తోంది. వచ్చిన మంచి మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఆమె కెరీర్ ని ప్రశ్నార్థకం చేసుకుంటుందని.. వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…