సాయంత్రం సమయంలో వేడివేడిగా బజ్జీలు తింటూ చాయ్ తాగడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే ఆ బజ్జీలు తినడం వల్ల మన ప్రాణాలు పోతాయని ఎవరమూ ఊహించము. ఇలా బజ్జీలను తినాలని ఆశ కలిగిన ఓ తల్లి, కొడుకు బజ్జీలను చేసుకుని ఎంతో ఇష్టంగా తిన్నారు. అయితే ఆ క్షణమే వారి జీవితంలో ఆఖరి క్షణం అవుతుందని వారు భావించలేదు. ఇలా బజ్జీలు తిన్న ఆ తల్లీ కొడుకులు అస్వస్థతకు గురై మృతి చెందారు. ఈ ఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలలోకి వెళ్తే.. హుదలి గ్రామంలో నివసించే పార్వతి, తన కుమారుడు సోమనింగప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలోనే ఈ తల్లీ కొడుకులు ఇద్దరూ సాయంత్రం ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. ఇలా బజ్జీలు తిన్న కొంత సమయానికి తల్లీ కొడుకులిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వారికి వాంతులు విరోచనాలు అవడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే తల్లి కొడుకుల ఇద్దరి మరణానికి కారణం ఏంటని పలువురు అనుమానాలను వ్యక్తం చేయగా బజ్జీలలో పురుగుల మందు కలిసి ఉంటుందని, ఆ విషపు బజ్జీలు తినడం వల్ల ఈ విధంగా మరణించారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా, లేకపోతే ఆ తల్లి కొడుకులు కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.