Mokshagna : గతేడాది వచ్చిన చిత్రాల్లో అఖండ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆయన నటించిన అఘోరా పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఓటీటీలోనూ అఖండ మూవీ రికార్డులను కొల్లగొట్టింది. దీనికి బోయపాటి దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయం సాధించినట్లు అయింది. అయితే బాలకృష్ణ త్వరలోనే అఖండ 2 చేయనున్నారు. దీనిపై బోయపాటి గతంలోనే క్లారిటీ ఇచ్చారు.
కాగా బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. దీంట్లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ అనంతరం ఆయన అనిల్ రావిపూడితో సినిమా చేస్తారు. ఆ తరువాతే అఖండ 2 ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలు అలా ఉండగా.. మరోవైపు బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞని సినీ రంగ ప్రవేశం చేయించాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారట. అందులో భాగంగానే ఆయన అనిల్ రావిపూడితో మోక్షజ్ఞ సినిమాపై చర్చించారట. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశారు. అందులో నిజం లేదన్నారు. అయితే బాలయ్య కొడుకు గనక ఏదైనా తేడా జరిగితే ఆయన ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందని అనిల్ రావిపూడి వద్దని చెప్పినట్లున్నారు. ఈ మేరకు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఇంకో దర్శకుడి పేరు బాగానే వినిపిస్తోంది.

బాలకృష్ణ కుటుంబానికి బోయపాటి బాగా దగ్గరివాడు. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. అలాగే బాలయ్యకు అన్నీ హిట్స్‌నే ఇచ్చారు. దీంతో బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినిమాకు బోయపాటి అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. దీంతో బోయపాటి ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. అయితే కథ విషయంలోనే తర్జన భర్జనలు జరుగుతున్నాయట. డెబ్యూ మూవీ కనుక మోక్షజ్ఞకు ఎలాంటి కథ అయితే సరిపోతుంది.. దాన్ని తాను తీయగలనా.. లేదా.. అని బోయపాటి ఆలోచిస్తున్నారట. అందులో భాగంగానే ఇప్పటికే పలు కథలను ఎంపిక చేసి బాలయ్యకు వినిపించారట కూడా. కానీ వేటినీ ఇంకా ఓకే చేయలేదట.
అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ ఇంకా చదువుకుంటున్నాడు కనుక.. అప్పటి వరకు ఒక మంచి కథను సిద్ధం చేసే పనిని బోయపాటికి అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో మోక్షజ్ఞ తెరంగేట్రం దాదాపుగా బోయపాటి సినిమాతోనే ఉంటుందని అంటున్నారు. అయితే ఏ విషయం అయిందీ.. త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు. కానీ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అయితే మాత్రం బాక్సులు పగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.