Bahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రెండు అద్భుతమైన చిత్రాలు.. బాహుబలి, ఆర్ఆర్ఆర్. బాహుబలి మూవీ రెండు పార్ట్‌లుగా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.2500 కోట్లను రెండు మూవీలు కలెక్ట్ చేశాయి. ఆర్ఆర్ఆర్ అయితే రూ.1200 కోట్లను వసూలు చేసింది. అయితే బాహుబలి మూవీలకు లభించినంత ఆదరణ.. ఆర్ఆర్ఆర్ కు లభించలేదనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి మూవీలను చూసినంత ఆసక్తిగా ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ ను చూడలేదు. ఇక బాహుబలితో పోలిస్తే.. ఆర్ఆర్ఆర్ కు ఆదరణ ఎందుకు తగ్గింది.. అనే విషయానికి వస్తే.. దీనికి పలు కారణాలను చెప్పవచ్చు. అవేమిటంటే..
బాహుబలి మూవీలు రెండు కూడా చెప్పిన టైముకు విడుదల చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ కు ఆలస్యం అయింది. పలుమార్లు విడుదల వాయిదా పడింది. దీంతో సినిమాపై సహజంగానే ఆసక్తి తగ్గిపోయింది. అలాగే బాహుబలి టైమ్ లో ఓటీటీల ప్రభావం అంతగా లేదు. కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో ఓటీటీల ఎఫెక్ట్ చాలానే ఉంది. కనుక ఒక నెల రోజులు పోతే ఓటీటీలోనే చూడవచ్చని చాలా మంది ఫిక్సయ్యారు. ఇది కూడా ఆర్ఆర్ఆర్ కు ఆదరణ తగ్గడం వెనుక ఉన్న కారణాల్లో ఒకటని చెప్పవచ్చు. అలాగే బాహుబలితో పోలిస్తే ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలోనే టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అసలే కరోనా వల్ల, పెరుగుతున్న ధరల వల్ల సతమతం అవుతున్న ప్రేక్షకులు అంత రేట్లు పెట్టి టిక్కెట్లను కొనడం ఎందుకులే.. అని భావించారు. దీని వల్ల కూడా ఆర్ఆర్ఆర్ కు ఆదరణ తగ్గిందని చెప్పవచ్చు.

బాహుబలిలో రానా విలన్‌గా చేయగా.. ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ వాళ్లను విలన్లుగా చూపించారు. వారి నటనకు ఇందులో పెద్దగా అవకాశం లేకుండా పోయింది. దీంతో సరైన విలన్ లేడన్న మైనస్ పాయింట్ చోటు చేసుకుంది. ఇది కూడా ఆర్ఆర్ఆర్ కు ఆదరణ తగ్గేందుకు ఒక కారణం అని చెప్పవచ్చు. అదేవిధంగా బాహుబలిలో తమన్నా, అనుష్క శెట్టి లతో రొమాన్స్ చేయించారు. కానీ ఆర్ఆర్ఆర్ లో అందుకు అవకాశం లేకపోయింది. దీంతో హీరోయిన్ పరంగా ఆర్ఆర్ఆర్ మైనస్ అయిందని చెప్పవచ్చు.
బాహుబలి మూవీని చాలా మంది పదే పదే చూశారు. ఈ మూవీకి అంతగా ఆదరణ లభించిందంటే ఇది ముఖ్య కారణమని చెప్పవచ్చు. కానీ ఆర్ఆర్ఆర్ కు అలా జరగలేదు. టిక్కెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఒక్కసారి చూడడమే ఎక్కువని భావించారు. ఇది ఆర్ఆర్ఆర్ ఆదరణను దెబ్బ తీసిందని చెప్పవచ్చు. బాహుబలి రెండు సినిమాలు రిలీజ్ అయిన తేదీల్లో పరీక్షలు లేవు. కానీ ఆర్ఆర్ఆర్ వచ్చినప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. కనుక సహజంగానే ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఇక బాహుబలి రెండు పార్ట్‌లుగా వచ్చింది. మొదటి పార్ట్ అనంతరం జనాల్లో క్రేజ్ బాగా పెరిగింది. దీంతో రెండో పార్ట్‌ను చాలా మంది చూశారు. కనుకనే రెండో పార్ట్‌కు వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఆర్ఆర్ఆర్ సింగిల్ మూవీ కనుక.. పెద్దగా ఆసక్తి క్రియేట్ అవలేదు. కనుకనే ఈ మూవీకి బాహుబలితో పోలిస్తే ఆదరణ తగ్గింది.
ఇక బాహుబలి ఒక ప్రత్యేకమైన సినిమా. ఆర్ఆర్ఆర్ స్వాతంత్య్ర సమరయోధుల మూవీ. కనుక ఆడియెన్స్‌కు ఈ జోనర్ పెద్దగా నచ్చలేదు. కనుక పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ కాలేదు. ఇన్ని కారణాల వల్లే బాహుబలితో పోలిస్తే ఆర్ఆర్ఆర్ కు ఆదరణ తగ్గిందని చెప్పవచ్చు. అయితే మహేష్ తో రాజమౌళి చేయబోయే మూవీ అయినా బాహుబలి అంచనాలను మించి ఉండేలా చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఫ్యాన్స్ విజ్ఞప్తిని రాజమౌళి పట్టించుకుంటారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.