Mokshagna : నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. పూరీ జగన్నాథ్, వినాయక్ వంటి దర్శకుల పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. వీరిలో ఎవరో ఒకరితో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అన్నారు. తరువాత అనూహ్యంగా అనిల్ రావిపూడి పేరు తెర మీదకు వచ్చింది. దీంతో ఆయన స్పందించి ఆ వార్తలను ఖండించారు. మోక్షజ్ఞతో సినిమా చేయాలని బాలకృష్ణ తనను అడగలేదని.. ఆయన సినిమా కోసమే తాను బాలకృష్ణను కలిశానని క్లారిటీ ఇచ్చారు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే మళ్లీ మోక్షజ్ఞ గురించి వార్తలు వస్తున్నాయి.
నందమూరి బాలకష్ణ తన తండ్రి ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఈ బ్యానర్‌లో మోక్షజ్ఞను పరిచయం చేయనున్నారని.. ఈ మూవీకి బాలకృష్ణనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అందులో అతను షాకింగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. బాగా మారిపోయినట్లు స్పష్టంగా చూడవచ్చు.

గతంలో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండేవాడు. అయితే ఈ మధ్యే ఒక ఫొటో బయటకు రాగా.. అందులోనూ కాస్త లావుగానే కనిపించాడు. కానీ ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చిన ఓ ఫొటోలో ఇంకా బరువు తగ్గినట్లు స్సష్టంగా కనిపిస్తోంది. అంటే మోక్షజ్ఞ ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడని స్పష్టమవుతోంది. ఇక ఓ ప్రముఖ టూవీలర్ కంపెనీకి చెందిన బైక్‌పై మోక్షజ్ఞ స్టైల్‌గా కూర్చుని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.