Jayamma Panchayathi : బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే మనకు ముందుగా సుమనే కనిపిస్తుంది. ఈమె అనేక టీవీ షోలను కూడా చేస్తోంది. అయితే చాలా ఏళ్ల తరువాత మళ్లీ వెండితెరపై పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో కనిపించి అలరించింది. జయమ్మ పంచాయితీ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.
మే 6వ తేదీన జయమ్మ పంచాయితీ మూవీ రిలీజ్ కాగా.. ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే సాధారణంగా అగ్ర హీరోల సినిమాలే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ ఈ మూవీ విడుదలై నెల రోజులు దాటినా ఓటీటీలోకి మాత్రం రాలేదు. అయితే కారణాలు ఏమున్నప్పటికీ ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ జూన్ 15వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ మూవీలో సుమతోపాటు దేవీ ప్రసాద్, దినేష్ కుమార్, షాలిని కొండెపూడిలు ఇతర కీలకపాత్రల్లో నటించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ మూవీని బలగ ప్రకాష్ నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.