Namrata Shirodkar : ఈ మధ్య స్టార్ హీరోల బర్త్ డే ల సందర్భంగా వారి పాత హిట్ సినిమాలను స్పెషల్ షోల రూపంలో థియేటర్లలో ప్రదర్శించడం ఆనవాయితీగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితం ఇలాగే మహేష్ బాబు పోకిరి సినిమా స్పెషల్ షోలు వేయడం జరిగింది. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జల్సా సినిమా 4కె లో విడుదల కానుంది. థియేటర్ల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే ఉంది. సదరు షోలకు టికెట్ల బుకింగులు కూడా మొదలవడంతోపాటు పలుచోట్ల అడ్వాన్సు బుకింగ్ లు స్పీడందుకున్నాయి. మెగా అభిమానుల సంబరాలు కూడా అప్పుడే మొదలైపోయాయి.
మరోవైపు కొందరు మెగా అభిమానులు జల్సా మూవీ స్పెషల్ షోల విషయంలో మహేష్ బాబు ఇంకా నమ్రతలపై ఆరోపణలు చేస్తున్నారు. జల్సా సినిమా పోకిరి రికార్డులను బ్రేక్ చేస్తుందని అందుకే వారికి మహేష్ బాబు కి చెందిన ఏఎంబీ సినిమాస్ లో జల్సా స్పెషల్ షోలను వేయడం ఇష్టం లేదని అందువల్ల వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఇక ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ పై నమ్రత ఆధిపత్యం ఉంది కనుక తనే ఇదంతా చేస్తుందని ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
అయితే ఈ ఆరోపణ అర్థం లేనిదనీ, జల్సా చిత్రం ఏఎంబీ సినిమాస్ లో విడుదల అవుతుందని, బుకింగ్స్ కూడా మొదలయ్యాయని కొందరు చెబుతున్నారు. ఏఎంబీ వారు ఆదాయంలో ఎక్కువ భాగం నిర్మాతలనుండి డిమాండ్ చేస్తారని, దీని కోసం జరిగే చర్చల వలన జల్సా ప్రదర్శన నిర్ణయం కొద్దిగా ఆలస్యం అయ్యిందని, ఇంతలో కొందరు హడావిడి చేశారని సిని వర్గాల సమాచారంగా తెలుస్తోంది. అయితే కొసమెరుపు ఏంటంటే ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు వాటా చాలా తక్కువ కాగా ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ది మెజారిటీ వాటాగా ఉంది. కానీ కొందరు కావాలనే మహేష్, నమ్రతలను టార్గెట్ చేశారని అభిప్రాయ పడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…