Allu Arjun : అల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్ కు బ‌లైపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Allu Arjun : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. కానీ బన్నీ దెబ్బ‌కో లేక‌ వారి దుర‌దృష్ట‌మో తెలియ‌దు గానీ.. ఆ హీరోయిన్లు ఎవ్వ‌రూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయారు. అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్లు ఎవ‌రు..? వాళ్లు బ‌న్నీ బ్యాడ్ సెంటిమెంట్ దెబ్బ‌తో ఇండ‌స్ట్రీ నుంచి ఎలా క‌నుమ‌ర‌గ‌య్యారో చూద్దాం.

బ‌న్నీ ఫ‌స్ట్ మూవీ గంగోత్రితో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది దివంగ‌త తార ఆర్తి అగ‌ర్వాల్ చెల్లి అదితి అగ‌ర్వాల్‌. ఈ సినిమా హిట్ అయినా.. ఆ త‌ర్వాత రెండు, మూడు సినిమాలు చేసి ఇండ‌స్ట్రీ నుంచి క‌నుమ‌రుగైపోయింది. అల్లు అర్జున్ వివి. వినాయ‌క్ కాంబినేష‌న్లో వ‌చ్చిన బ‌న్నీ సినిమాతో గౌరీ ముంజ‌ల్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత తెలుగులో గౌరి సినిమాతోపాటు క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా నిల‌దొక్కుకోలేక త్వ‌ర‌గా ఫేడ‌వుడ్ అయిపోయింది.

Allu Arjun

బన్నీ రెండో సినిమా ఆర్యలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది. బన్నీ సక్సెస్ సాధించినా అనురాధ మెహతా కెరీర్ కు ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు. అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి భాను శ్రీ మెహ్రా పరిచయమయ్యింది. ఈ హీరోయిన్ కు వరుడు మూవీ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప‌రుగు సినిమాతో షీలా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమా చేసింది.

అయితే ఆమెకు ఎందుకో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ వ‌చ్చినా నిల‌దొక్కుకోలేక‌పోయింది. బ‌న్నీ – క్రిష్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన వేదం సినిమాతో దీక్షా సేథ్ ఆ త‌ర్వాత గోపీచంద్‌, మ‌నోజ్ లాంటి హీరోల ప‌క్క‌న న‌టించినా స‌క్సెస్ కాలేదు. అందం ఉన్నా కూడా దీక్ష నిల‌దొక్కుకోలేదు. ఏదేమైనా బ‌న్నీ హీరోగా సూపర్ సక్సెస్ అయినా ఆయన సినిమాలతో పరిచయమైన హీరోయిన్లకు మాత్రం వరుస షాకులు తగిలి ఇండస్ట్రీని వదిలిపోయారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM