Khushi Movie : లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరొక పరాజయం తోడైంది. ఆయన ఈ చిత్ర విజయంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ విజయ్ తోపాటు నిర్మాతలైన చార్మీ ఇంకా పూరీ జగన్నాథ్ లను కూడా కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ సమంతపైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నారని సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
ఇంతకీ అసలు విషయంలోకి వెళితే.. నిన్ను కోరి, టక్ జగదీష్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ఖుషి అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం 2 ముఖ్యమైన షెడ్యూళ్ల షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఓ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో సమంత చాలా బలమైన పాత్రలో చేయనుందని తెలుస్తోంది. త్వరలో విజయ్ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక లైగర్ సినిమా పరాజయంతో విజయ్ అభిమానులు తమ దృష్టిని ఖుషి చిత్రం వైపు మళ్లించినట్లు తెలిసింది. ఇక సమంత ఈ మూవీలో నటిస్తుండడంతో తను కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుందనే భావిస్తున్నారు. సమంత స్క్రీన్ ప్రసెన్స్ ఇంకా తన నటనతో మజిలీ సినిమాలో చేసినట్టుగానే దీంట్లో కూడా మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇందుకోసం సమంత పైనే భారం వేసి ఖుషి చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.
అయితే లైగర్ డిజాస్టర్ తో పూరీ ఇంకా చార్మీలు బయట కనిపించడం లేదు కానీ విజయ్ మాత్రం దుబాయ్ లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో సరదాగా మాట్లాడుతూ కనిపించి అభిమానులను అలరించాడు. ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాబోతున్న ఖుషి చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…