Uday Kiran : లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తొలి మూడు చిత్రాలతో సక్సెస్‌ఫుల్ హీరో అయ్యారు. చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలు ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్‌ను కట్టబెట్టాయి. దీంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ తరువాత తీసిన సినిమాలు అన్నీ దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. ఒకటి రెండు సినిమాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. ఈ క్రమంలోనే ఉదయ్‌కు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. తరువాత ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారు. ఇదంతా బయట ప్రపంచానికి తెలిసిన విషయమే.
అయితే ఉదయ్ కిరణ్ డిప్రెషన్‌తో చనిపోలేదని.. అందుకు వేరే కారణాలు ఉన్నాయని అంటున్నారు. జూన్ 26వ తేదీన ఉదయ్ కిరణ్ 42వ జయంతి. దీంతో ఆయన సినిమాలకు చెందిన విషయాలతోపాటు పలు ఇతర అంశాలను కూడా నెటిజన్లు పైకి తెస్తున్నారు. వాటిల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి అంశం. అప్పట్లో ఆయన తన కుమార్తె సుస్మితను ఉదయ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ ఇద్దరికీ మనస్ఫర్థలు వచ్చి విడిపోయారు. దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చిరంజీవి ఉదయ్‌కి సినిమా అవకాశాలు రాకుండా చేశారట. ఇదే విషయాన్ని తాజాగా నిర్మాత ఏఎం రత్నం కన్‌ఫామ్ చేశారు.
ఏఎం రత్నం ఇటీవలే ఓ ఫంక్షన్‌కు రాగా ఆయన ఉదయ్ కిరణ్‌కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అప్పట్లో ఉదయ్‌తో కలసి ఆయన తెలుగు, తమిళం భాషల్లో ఓ మూవీని తీశారు. దాని షూటింగ్ 80 శాతం వరకు కంప్లీట్ అయింది. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఒత్తిడి రావడంతో ఆ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారట. దీంతో ఉదయ్‌కు హఠాత్తుగా సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇవే విషయాలను ఏఎం రత్నం చెప్పారని ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిల్లో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
కాగా.. ఉదయ్ కిరణ్ ఆర్థిక సమస్యలతో సూసైడ్ చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అది కారణం కాదని.. ఉదయ్‌కి ఆస్తులు, భూములు బాగానే ఉన్నాయని ఆయన సోదరి వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు రాక డిప్రెషన్‌కు గురయ్యే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని అన్నారు. అయితే ఆయన మృతికి కారణం ఎవరు అయినా సరే ప్రస్తుతం మరోసారి చిరంజీవి కుటుంబాన్ని ఇందులోకి లాగుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…