Gali Janardhan Reddy : మైనింగ్ కింగ్‌గా పేరుగాంచిన గాలి జనార్ధన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అప్పట్లో తన కుమార్తె వివాహం కోసం ఏకంగా రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వేడుక సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా డ్యాన్స్ చేసి ఒక్క రాత్రికే రూ.1 కోటి వసూలు చేసింది. ఈ విధంగా అప్పట్లో ఆయన కుమార్తె వివాహ విషయాలు వైరల్ అయ్యాయి. అయితే ఆయన మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఒక్క రోజు సీఎం అవుతానని వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవగా.. ఇప్పుడు మళ్లీ ఆయనకు సంబంధించిన వార్త ఒకటి వైరల్‌గా మారింది.
గాలి జనార్దన్ రెడ్డి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ఇటీవల తీసిన 777 చార్లి అనే సినిమాను చూశారు. ఇంట్లోని తన హోమ్ థియేటర్‌లో ఈ మూవీని ఆయన కోసం ప్రైవేట్‌గా స్క్రీనింగ్ వేశారు. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆ మూవీని చూశారు. అయితే ఆయన హోమ్ థియేటర్ చిన్నపాటి థియేటర్‌ను పోలి ఉంది. అచ్చం థియేటర్‌లలోగే రిక్లైనర్ సీట్లు కూడా ఉన్నాయి. ఒక సీట్‌లో ఆయన కుక్క కూడా కూర్చుని సినిమా చూసింది. ఈ క్రమంలోనే ఆయన సినిమా చూస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మూవీని చూసిన అనంతరం ఆయన సినిమా బాగుందని అన్నారు.
ఇక గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో అతను నటిస్తున్నాడు. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని మార్చి నెలలో లాంచ్ చేశారు. రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై సినిమాను ప్రారంభించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…