Mahesh Babu Businesses : వామ్మో.. మ‌హేష్ బాబుకు అన్ని వ్యాపారాలు ఉన్నాయా..?

Mahesh Babu Businesses : దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న సామెత మ‌నంద‌రికీ తెలుసు. అందుక‌నే చాలా మంది ఒక రంగంలో రాణిస్తూనే ఇంకో రంగంలో పెట్టుబ‌డులు పెట్టి ధ‌నాన్ని ఎక్కువ‌గా సంపాదించాల‌ని చూస్తుంటారు. ఈ విష‌యంలో సెల‌బ్రిటీలు కూడా త‌క్కువేమీ తిన‌లేదు. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు ఇత‌ర వ్యాపారాల్లోనూ జోరు కొన‌సాగిస్తున్నారు. అయితే సాధార‌ణంగా చాలా మంది సెల‌బ్రిటీలు రెస్టారెంట్ల‌ను పెడుతుంటారు. ఎందుకంటే వారి పాపులారిటీతో అవి సుల‌భంగా వృద్ధిలోకి వ‌స్తాయి క‌నుక‌. ఇక ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు సొంత మ‌ల్టీప్లెక్స్‌ల‌ను కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఏషియ‌న్ వారి స‌హ‌కారంతో ఓ మ‌ల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. ముందుగా దీన్ని మ‌హేష్ ప్రారంభించార‌ని చెప్ప‌వ‌చ్చు.

మ‌హేష్ బాబుకు గ‌చ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ పేరిట మ‌ల్టీప్లెక్స్ ఉంది. దాన్ని చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఓ మ‌ల్టీప్లెక్స్‌ను నిర్మించుకున్నాడు. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న సినిమాల్లో న‌టిస్తార‌ని.. ఏఎంబీ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ఉంద‌ని మాత్ర‌మే చాలా మందికి తెలుసు. కానీ ఆయ‌న‌కు ఉన్న ఇత‌ర వ్యాపారాల గురించి చాలా మందికి తెలియ‌దు. ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు. కానీ ఆయ‌న పేరు త‌న కంపెనీలో ఎక్క‌డ కూడా బ‌య‌ట‌కు రాదు. ఆయ‌న ఆ వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్‌న‌ర్‌గా ఉన్నార‌ట‌.

Mahesh Babu Businesses

ఇక మ‌హేష్‌బాబు, భార్య న‌మ‌త్ర‌లు క‌ల‌సి దుస్తుల వ్యాపారం కూడా చేస్తున్నార‌ట‌. కానీ ఆ విష‌యాలు కూడా బ‌య‌ట‌కు తెలియ‌వు. వారు ఓ ప్ర‌ముఖ మాల్స్ సంస్థ‌తో భాగ‌స్వామ్యం అయి వ్యాపారం చేస్తున్నార‌ట‌. ఇందులోనూ వారు స్లీపింగ్ పార్ట్‌న‌ర్‌గా ఉన్నార‌ని స‌మాచారం. అలాగే ఓ హాస్పిట‌ల్‌లోనూ వీరికి పార్ట్‌న‌ర్ షిప్ ఉంద‌ని స‌మాచారం. ఇక మ‌హేష్ ప్ర‌స్తుతం ఒక్క సినిమాకు గాను రూ.50 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. ఇలా మ‌హేష్ కేవ‌లం సినిమాలు మాత్ర‌మే కాకుండా ప‌లు వ్యాపారాల‌తోనూ ఎంతో బిజీగా ఉన్నారు. కానీ ఆయ‌న చేసే వ్యాపారాల గురించి బ‌య‌ట‌కు ఎలాంటి వివ‌రాలు తెలియ‌వు.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM