Mahesh Babu Businesses : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత మనందరికీ తెలుసు. అందుకనే చాలా మంది ఒక రంగంలో రాణిస్తూనే ఇంకో రంగంలో పెట్టుబడులు పెట్టి ధనాన్ని ఎక్కువగా సంపాదించాలని చూస్తుంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా తక్కువేమీ తినలేదు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇతర వ్యాపారాల్లోనూ జోరు కొనసాగిస్తున్నారు. అయితే సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు రెస్టారెంట్లను పెడుతుంటారు. ఎందుకంటే వారి పాపులారిటీతో అవి సులభంగా వృద్ధిలోకి వస్తాయి కనుక. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు సొంత మల్టీప్లెక్స్‌లను కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ వారి సహకారంతో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. ముందుగా దీన్ని మహేష్ ప్రారంభించారని చెప్పవచ్చు.
మహేష్ బాబుకు గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ ఉంది. దాన్ని చూసి విజయ్ దేవరకొండ కూడా ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించుకున్నాడు. ఇక మహేష్ విషయానికి వస్తే.. ఆయన సినిమాల్లో నటిస్తారని.. ఏఎంబీ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ఉందని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయనకు ఉన్న ఇతర వ్యాపారాల గురించి చాలా మందికి తెలియదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు. కానీ ఆయన పేరు తన కంపెనీలో ఎక్కడ కూడా బయటకు రాదు. ఆయన ఆ వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నారట.

ఇక మహేష్‌బాబు, భార్య నమత్రలు కలసి దుస్తుల వ్యాపారం కూడా చేస్తున్నారట. కానీ ఆ విషయాలు కూడా బయటకు తెలియవు. వారు ఓ ప్రముఖ మాల్స్ సంస్థతో భాగస్వామ్యం అయి వ్యాపారం చేస్తున్నారట. ఇందులోనూ వారు స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నారని సమాచారం. అలాగే ఓ హాస్పిటల్‌లోనూ వీరికి పార్ట్‌నర్ షిప్ ఉందని సమాచారం. ఇక మహేష్ ప్రస్తుతం ఒక్క సినిమాకు గాను రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలా మహేష్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వ్యాపారాలతోనూ ఎంతో బిజీగా ఉన్నారు. కానీ ఆయన చేసే వ్యాపారాల గురించి బయటకు ఎలాంటి వివరాలు తెలియవు.