Meena : సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే తన భర్తను కోల్పోయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమెను ఒక్కసారిగా వివాదాలు చుట్టు ముట్టాయి. అలాగే భర్తతో కలసి ఉన్న మధుర క్షణాలను ఆమె గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తాజాగా మీనా తన భర్త గురించి మళ్లీ పోస్టు పెట్టింది. పెళ్లి రోజున ఆయనను తలచుకుంటూ ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భర్తను ఈ మధ్యే కోల్పోయిన మీనా తీవ్రమైన దుఃఖంలో ఉంది. ఆమె భర్త విద్యాసాగర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. కానీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. దీంతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలోనే విద్యాసాగర్ జూన్ 29న చనిపోయారు. అప్పటి నుంచి మీనాపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. మీనా వల్లే ఆమె భర్త చనిపోయాడని.. కాదు వారి ఇంటి దగ్గర ఉన్న పావురాల వల్ల చనిపోయాడని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి.
అయితే ఆ వార్తలపై స్పందించిన మీనా ఈ సమయంలో తనను ఇలా తప్పుడు వార్తలతో ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తనకు ప్రైవసీ కల్పించాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఆ తరువాత కూడా ఆమెపై రూమర్స్ ఆగలేదు. మీనా భర్తకు రూ.250 కోట్ల ఆస్తి ఉందని.. దాన్ని మీనాకు కాకుండా తన కుమార్తె నైనిక పేరిట రాశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై మీనా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె తమ పెళ్లి రోజు సందర్భంగా మళ్లీ పోస్ట్ పెట్టింది. భర్తను తలచుకుంటూ ఎమోషనల్ అయింది.
నువ్వు ఒక అందమైన దేవుడిచ్చిన దీవెనవి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా నా నుంచి తీసుకెళ్లాడు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు. మన ఫ్యామిలీ, నేను, ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను, ప్రార్థనలను పంపిస్తున్నా.. మిలియన్ హార్ట్స్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఈ విపత్కర పరిస్థితుల్లో మాపై.. స్నేహితులు, ఫ్యామిలీ ఎవరు అయితే శ్రద్థ, ప్రేమను చూపిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారో.. మీరు మా జీవితంలో ఉన్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమను నేను గ్రేట్ ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను.. అంటూ మీనా పోస్ట్ పెట్టింది. కాగా ఈమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీనా తన భర్తను ఎంతగా మిస్ అవుతుందో కదా.. అని నెటిజన్లు సైతం విచారిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…