Naresh : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్‌ల వ్యవహారం ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరు మైసూర్‌లోని ఒక హోటల్‌లో రమ్య రఘుపతికి పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే వివాదం మరింత ముదిరింది. హోటల్ గది నుంచి బయటకు వస్తుండగా.. పవిత్రను రమ్య చెప్పుతో కొట్టబోయింది. కానీ అప్పుడు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఆ సమయంలోనే నరేష్ తన భార్య రమ్యను చూస్తూ విజిల్స్ వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పవిత్రతో అలా పట్టుబడడమే కాకుండా.. తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు విజిల్స్ వేసుకుంటూ పోయాడని నరేష్‌ను నెటిజన్లు ట్రోల్ చేశారు.
ఇక ఈ వ్యవహారంపై సూపర్ స్టార్ కృష్ణ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు తెలిసే తాము ఇదంతా చేస్తున్నామని అంతకు ముందు పవిత్ర లోకేష్ స్వయంగా మీడియా ముందు చెప్పేసింది. దీంతో కృష్ణ పేరు ఇందులో ఇన్వాల్వ్ అయింది. అయితే కృష్ణ నరేష్ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన నరేష్‌ను మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నరేష్‌తో పర్సనల్‌గా మాట్లాడారట. ఈ క్రమంలోనే నరేష్‌కు మహేష్ ఒక రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మీకు ఏమైనా ఇలాంటి వ్యవహారాలు ఉంటే కూర్చుని పరిష్కారం చేసుకోండి.. కానీ ఇలా ఫ్యామిలీ విషయాలను బయటకు తీయవద్దు.. అంటూ మహేష్.. నరేష్‌ను కోరారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే నరేష్‌కు మహేష్ నిజంగానే రిక్వెస్ట్ చేశారా.. లేదా.. అన్నది తెలియదు కానీ.. నరేష్ వ్యవహారం మాత్రం రోజు రోజుకీ ముదిరి పాకానపడుతోంది. మరి దీనికి ముగింపు ఎప్పుడు ఇస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…