Kajal Aggarwal : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ మూవీకి రూ.84 కోట్ల మేర నష్టాలు రాగా చరణ్ ఇప్పటికే రూ.25 కోట్లను సెటిల్ చేశారని సమాచారం. అలాగే చిరంజీవి కూడా తాను ఈ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్‌ను డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నారట. ఇక మరోవైపు ఈ మూవీ నిర్మాణంలోనూ వాటా కలిగి ఉన్న దర్శకుడు కొరటాల శివ నష్టాలను భరించేందుకు హైదరాబాద్‌లోని ప్రైమ్ ఏరియాలో ఉన్న తన ప్లాట్‌ను అమ్మబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..
ఆచార్య మూవీలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపించారు. అయితే అలాంటి వ్యక్తికి హీరోయిన్ ఎందుకన్న ఉద్దేశంతో కాజల్ అగర్వాల్ సీన్లను తొలగించామని దర్శకుడు కొరటాల చెప్పారు. అందులో భాగంగానే చిత్ర ట్రైలర్‌లోనూ ఎక్కడా ఆమె కనిపించలేదు. దీనిపై కొరటాల ఆ విధంగా వివరణ ఇచ్చారు. అయితే ఆచార్య మూవీ త్వరలోనే శాటిలైట్ టీవీలో ప్రసారం అవుతుందని తెలుస్తుండగా.. ఆ టీవీ చానల్ వారు ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
ఆచార్య శాటిలైట్ హక్కులను విక్రయించినప్పుడు అందులో కాజల్ అగర్వాల్ పేరు ఉందట. దీంతో కాజల్ అగర్వాల్ సీన్లు ఉన్న సినిమానే కావాలని సదరు చానల్ వారు పట్టుబడుతున్నారట. అగ్రిమెంట్ ప్రకారం మేకర్స్ కూడా అలాగే మూవీని ఆ టీవీ చానల్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాజల్ లేకుండానే ఆమె సీన్లను తొలగించి ఆచార్య మూవీని రిలీజ్ చేశారు. కనుక ఆ మూవీని ఇప్పుడు శాటిలైట్‌కు ఇస్తామని అంటున్నారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం అయితే ఆమె ఉన్న సీన్లతో కూడిన మూవీనే మేకర్స్ టీవీ చానల్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చేసుకున్న డీల్‌లో సగం మొత్తమే ఇస్తామని ఆ టీవీ చానల్ వారు మెలికపెడుతున్నారట.
ఇక ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉన్న ఆచార్య మేకర్స్ శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే మొత్తాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టం పడడం లేదట. కనుక వారు కాజల్ ఉన్న సీన్లతోనే మూవీని అందిస్తామని చెబుతున్నారట. అందువల్ల కాజల్ అగర్వాల్ ఉన్న సీన్లను ఆచార్యలో మళ్లీ కలపనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే ఒక అప్ డేట్ రానున్నట్లు సమాచారం. సినిమాలో హీరోయిన్ లేకపోవడం చాలా మైనస్ కాగా.. ఇప్పుడు ఆమె ఉన్న సీన్లను మళ్లీ కలపబోతుండడంతో ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. మరి టీవీలో వచ్చే ఆచార్య మూవీలో అయినా కాజల్ అగర్వాల్ కనిపిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…