Prabhas : కొన్ని కాంబినేషన్స్ ఆన్ స్క్రీన్ మీదే బాగుంటాయి.. కొన్ని జోడీలు ఆన్ స్క్రీన్ తోపాటు ఆఫ్ స్క్రీన్ కూడా బాగుంటాయి. అలాంటి వారిలో ముందుంటారు ప్రభాస్ అండ్ అనుష్క. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. సూపర్ హిట్ జోడీ అయిన ఈ జంట పర్సనల్ లైఫ్ లో కూడా ఒకటి అయితే బాగుండని ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రభాస్ అనుష్క కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో నటించారు. మిర్చి టూ బాహుబలి వరకు వీరు దాదాపు కలిసి పనిచేశారు. బాహుబలి రెండు పార్టుల కోసమే ఐదేళ్లు వర్క్ చేయాల్సి వచ్చింది.
హీరో హీరోయిన్లు కొద్దిగా క్లోజ్ గా ఉంటే మీడియా రెచ్చిపోవడం కామనే. అలాగే ప్రభాస్, అనుష్క ల మధ్య సంథింగ్ సంథింగ్ అని హడావిడి మొదలు పెట్టింది. కొందరైతే ప్రభాస్, అనుష్క మ్యారేజ్ పక్కా అని కూడా రాసేశారు. పెళ్లి గురించి మాట్లాడితే వీరు కూడా సైలెంట్ గా ఉండటం వల్ల ఈ రూమర్స్ కి మరింత స్కోప్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే ప్రభాస్ పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. సినిమాలు చేయకుండా అనుష్క కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఈ టైం లో బాంబ్ పేల్చాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ప్రభాస్.. అనుష్కల జీవితాల్లో పెళ్లి యోగం లేదని అన్నాడు. వీరి జాతకంలో గురువు నీచంలో ఉన్నాడు. అందుకే పెళ్లి అసలు కలిసి రాదని అంటున్నారు వేణు స్వామి.

వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ తో అటు ప్రభాస్ ఫ్యాన్స్.. ఇటు అనుష్క ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒకవేళ కాదు కూడదు అని పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి సక్సెస్ కాకపోవడానికే ఛాన్స్ ఎక్కువ ఉందని అన్నారు వేణు స్వామి. ఆయన చెప్పిన జ్యోతిష్యం మీద సెలబ్రిటీల ఫోక్స్ ఎక్కువైంది. ఎందుకంటే నాగ చైతన్య, సమంత మ్యారేజ్ టైం లోనే వారిద్దరు విడిపోతారని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే నాగ చైతన్య, సమంత డైవోర్స్ తీసుకున్నారు. మరి ప్రభాస్, అనుష్క మ్యారేజ్ విషయంలో వేణు స్వామి చెప్పింది జరుగుతుందా లేదా అన్నది చూడాలి.